ప్రగతి భవన్ లో కేసీఆర్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు.
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ తో మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆదివారంనాడు ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. శనివారంనాడు సుమారు 9 గంటల పాటు ఈడీ విచారణను కవిత ఎదుర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ నెల 7వ తేదీన కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. కానీ ముందుగా ప్లాన్ చేసుకన్న షెడ్యూల్ కారణంగా ఈ నెల 9వ తేదీన విచారణకు రాలేనని కవిత ఈడీకి లేఖ రాశారు.ఈ నెల 11న విచారణకు హాజరు కానున్నట్టుగా ఈడీకి సమాచారం పంపింది .ఈ సమాచారం ఆధారంగా ఈడీ అధికారుల విచారణకు కవిత నిన్న హాజరయ్యారు.
ఈడీ విచారణకు కవిత హాజరైన నేపథ్యంలో తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తదితరులు నిన్న ఢిల్లీలోనే ఉన్నారు. విచారణకు హాజరయ్యే సమయంలో కవితతో వీరంతా భేటీ అయ్యారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం ఈ నెల 10వ తేదీ సాయంత్రం ఢిల్లీకి చేరుకుంది. ఈడీ విచారణలో ఎలా వ్యవహరించాలనే దానిపై న్యాయ నిపుణులు కవితకు పలు సూచలను సలహచ్చారని సమాచారం.
నిన్న రాత్రి ఢిల్లీ నుండి హైద్రాబాద్ కు కవిత బృందం చేరుకుంది. నిన్న రాత్రి ప్రగతి భవన్ లో కేసీఆర్ తో కవిత భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం హరీష్ రావు, కవితలు మరోసారి ప్రగతి భవన్ కు చేరుకొని కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈడీ విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలు , సమాధానాలు చెప్పిన తీరుపై చర్చించారు. ఈ నెల 16వ తేదీన మరోసారి ఈడీ అధికారులు విచారణకు రావాలని ఆదేశించారు. దరిమిలా ఏం చేయాలనే దానిపై కేసీఆర్ తో కవిత, హరీష్ రావులు చర్చిస్తున్నారని సమాచారం.
also read:డిల్లీ లిక్కర్ స్కాంపై ఈడీ ప్రశ్నలు... నాా సమాధానాలివే : అర్థరాత్రి కేసీఆర్ తో కవిత భేటీ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ నెల 6వ తేదీన ఈడీ అధికారులు అరుణ్ రామచంద్రపిళ్లైని అరెస్ట్ చేశారు తాను గతంలో ఈడీకి ఇచ్చిన వాంగ్మూలం వెనక్కి తీసుకొంటున్నట్టుగా రౌస్ అవెన్యూ కోర్టులో ఈ నెల 10వ తేదీన అరుణ్ రామచంద్రపిళ్లై పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.అరుణ్ రామచంద్రపిళ్లై వాంగ్మూలంలో కవిత పేరు ఉందని ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కాం అంశం దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రకపంనలు సృష్టిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసుకు సంబంధించి పలువురిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. నిన్న ఇదే కేసులో కవితను ఈడీ అధికారులు విచారించారు. మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. గత ఏడాది డిసెంబర్ 11న సీబీఐ అధికారులు కవితను విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయమై న్యాయపరంగా ఎలా ఎదర్కోవాలనే దానిపై కేసీఆర్ తో కవిత, హరీష్ రావు చర్చిస్తున్నారని సమాచారం.