''ఎమ్మెల్సీ క‌విత దంప‌తులకు పెళ్లిరోజు శుభాకాంక్ష‌లు''

Published : Jun 23, 2023, 11:16 AM ISTUpdated : Jun 23, 2023, 11:18 AM IST
''ఎమ్మెల్సీ క‌విత దంప‌తులకు పెళ్లిరోజు శుభాకాంక్ష‌లు''

సారాంశం

Wedding Anniversary: బీఆర్ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత నేడు త‌న పెళ్లిరోజును జ‌రుపుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే క‌విత దంప‌తుల‌కు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్ర‌ముఖుల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.   

Kalvakuntla Kavitha-Devanapalli Anil Kumar: తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత-దేవ‌న‌ప‌ల్లి అనిల్‌కుమార్ ల పెళ్లి రోజు నేడు. ఈ క్ర‌మంలోనే వారు వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా క‌విత ఆమె భ‌ర్త‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ త‌మ ప్రేమను గుర్తు చేసుకున్నారు. క‌ష్ట‌సుఖాల్లో తోడుగా ఉన్న‌ ప్రియ‌మైన శ్రీవారికి పెళ్లి రోజు శుభాకాంక్ష‌లు అంటూ ట్వీట్ చేశారు. 

''అన్ని ఆటుపోట్లను తట్టుకుని  నిలిచిన ఉత్తమ వ్యక్తిని జీవితంలోకి రావ‌డం సంతోషంగా ఉంది. ప్రియమైన శ్రీవారు మీకు పెళ్లి రోజు శుభాకాంక్ష‌లు'' అంటూ పేర్కొన్నారు. ఇద్ద‌రు ఉన్న ఫోటోను షేర్ చేశారు. 2002 లో కల్వకుంట్ల కవిత, అనిల్ ల వివాహం జ‌రిగింది. ఈ దంపతులకు ఆదిత్య, ఆర్య అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 

 

 

క‌విత దంప‌తుల‌కు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్ర‌ముఖుల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. 
 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Revanth Reddy : రేవంత్ రెడ్డికి కేరళ అవార్డు.. ఎవరీ ఆర్యదాన్ ముహమ్మద్?
Balapur Ganesh Laddu: హిస్టరీ క్రియేట్ చేసిన బాలాపూర్ లడ్డూ వేలం.. ఎవరు దక్కించుకున్నారో తెలుసా?