టీ కాంగ్రెస్ రాజకీయం బెంగళూరుకు షిప్ట్?.. డీకేశితో కోమటిరెడ్డి భేటీ.. ఆ విషయంపైనే చర్చ..!

Published : Jun 23, 2023, 11:06 AM ISTUpdated : Jun 23, 2023, 03:14 PM IST
టీ కాంగ్రెస్ రాజకీయం బెంగళూరుకు షిప్ట్?.. డీకేశితో కోమటిరెడ్డి భేటీ.. ఆ విషయంపైనే చర్చ..!

సారాంశం

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో అన్ని రకాల వ్యుహాలను అమలు చేస్తోంది. కర్ణాటకలో గెలుపు తర్వాత తెలంగాణలో మరింత దూకుడు పెంచింది.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో అన్ని రకాల వ్యుహాలను అమలు చేస్తోంది. కర్ణాటకలో గెలుపు తర్వాత తెలంగాణలో మరింత దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా పార్టీలో సైలెంట్‌గా ఉన్న స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పార్టీలో యాక్టివ్ అయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి పలువురు నాయకులను ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా.. స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి ఆహ్వానించారు. తాజాగా బెంగళూరు వెళ్లిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో సమావేశమయ్యారు. 

కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్.. కర్ణాటకలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పార్టీ గెలుపు కోసం కొంతమేర ఆయన సేవలను వినియోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే బెంగళూరు వెళ్లిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. డీకే శివకుమార్‌ను కలిసి రాష్ట్రంలోని పరిణామాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. కోమటిరెడ్డి ఇటీవల ఢిల్లీలో కూడా కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీతో సమమావేశమై పలు అంశాలు చర్చించారు. ఆ తర్వాత పార్టీలు ఫుల్ యాక్టివ్‌ అయిన కోమటిరెడ్డి.. ప్రియాంక నుంచి వచ్చిన సూచనల మేరకే  డీకే శివకుమారర్‌తో సమావేశమైనట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీ కాంగ్రెస్ రాజకీయం.. బెంగళూరుకు షిఫ్ట్ అయినట్టుగానే కనిపిస్తోంది.

ఈ సమావేశంలో వైఎస్ షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనంపై ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. డీకే శివకుమార్ ఫ్యామిలీతో షర్మిల కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే షర్మిలకు చెందిన వైఎస్సార్‌టీపీని.. కాంగ్రెస్‌లో విలీనం చేయించేలా తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నాయిని గత  కొంతకాలంగా ప్రచారం సాగుతున్న సంగతి  తెలిసిందే. ఇదే వ్యవహారంపై శివకుమార్‌తో కోమటిరెడ్డి చర్చించినట్టుగా తెలుస్తోంది. షర్మలను కాంగ్రెస్‌లోకి తీసుకోచ్చేలా చూడాలని కోమటిరెడ్డి ఈ సందర్భంగా కోరినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది.

అదే సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తిరికి  కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం కూడా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశాలపై.. డీకే శివకుమార్‌తో కోమటిరెడ్డి చర్చించి ఉంటారని తెలుస్తోంది. ఇక, తెలంగాణ‌లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాలని టీ కాంగ్రెస్ నేతలు చెబుతున్న సంగతి  తెలిసిందే. అలాగే కాంగ్రెస్‌ను వీడిన నేతలు కూడా తిరిగి పార్టీలోకి చేరాలని కూడా పిలుపునిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు