ఓటమిపై పోస్ట్‌మార్టం: అసెంబ్లీ వారీగా సమీక్షించనున్న కేసీఆర్

By narsimha lodeFirst Published Jan 11, 2024, 5:03 PM IST
Highlights


కేసీఆర్ ఆరోగ్యం కుదుట పడిన తర్వాత పార్టీ కార్యక్రమాలపై  ఫోకస్ పెట్టనున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఓటమిపై భారత రాష్ట్ర సమితి  అధినేత  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో  సమీక్షలు నిర్వహించనున్నారు. 

2023 నవంబర్ మాసంలో  జరిగిన  తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో   భారత రాష్ట్ర సమితి అధికారాన్ని కోల్పోయింది.ఆ పార్టీ  కేవలం  39 అసెంబ్లీ స్థానాల్లోనే విజయం సాధించింది.   కాంగ్రెస్ పార్టీ  64 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది.  

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన  పదేళ్ల తర్వాత  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.  తెలంగాణలో  దాదాపుగా తొమ్మిదిన్నర ఏళ్ల పాటు  భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. తొలిసారిగా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారానికి దూరమైంది.  బీఆర్ఎస్ కేవలం  39 స్థానాలకే పరిమితమైంది. 

also read:ముద్రగడ ఇంటికి ప్రధాన పార్టీల నేతల క్యూ: పద్మనాభం పయనమెటు?

రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా  బీఆర్ఎస్ అధినేత  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించనున్నారు.  ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో  పార్టీ ఓటమికి గల కారణాలపై  కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు.  ఇప్పటికే  పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలను  ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సహా  సీనియర్ నేతలు  సమీక్షలు నిర్వహిస్తున్నారు.

also read:సంక్రాంతికి తెలుగు దేశం అభ్యర్థుల తొలి జాబితా: 25 మందికి చోటు

2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో   బీఆర్ఎస్ కు  63 స్థానాలు దక్కాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో  88 అసెంబ్లీ స్థానాల్లో  ఆ పార్టీ విజయం సాధించింది.  కానీ, 2023లో బీఆర్ఎస్ కు  కేవలం  39 సీట్లు మాత్రమే దక్కాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య  ఓట్ల తేడా  రెండు శాతం లోపుగానే ఉంది.  కానీ  బీఆర్ఎస్ అధికారానికి దూరమైంది.  రాష్ట్రంలో  ఓటమికి గల కారణాలపై  బీఆర్ఎస్ నాయకత్వం  సమీక్షలు నిర్వహించనుంది. 

ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటమికి గల కారణాలపై  ఆ పార్టీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఏ కారణాలు  ఓటమికి దారి తీశాయనే విషయమై  పార్టీ నాయకత్వం  సమీక్షలు నిర్వహించనుంది. 

also read:కాంగ్రెస్‌లోకి విక్రంగౌడ్: నామినేటేడ్ పదవి, గోషామహల్ ఇంచార్జీ పదవి?

హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ తర్వాత కేసీఆర్  తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.  కేసీఆర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఫిబ్రవరి మాసంలో    పార్టీ కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారని   నేతలు  చెబుతున్నారు.  పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు పూర్తి కాగానే  అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించాలని  బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తుంది. ఈ సమీక్షలు పూర్తైన తర్వాత  కేసీఆర్ జిల్లాల్లో పర్యటనలు చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు  పార్టీ క్యాడర్ ను సన్నద్దం చేయడానికి జిల్లాల్లో  కేసీఆర్ పర్యటించనున్నారు. 
 

click me!