బీఆర్ఎస్ కు మళ్లీ షాక్.. 20 మంది కౌన్సిలర్లు రాజీనామా..

By Sairam IndurFirst Published Jan 11, 2024, 4:22 PM IST
Highlights

బీఆర్ఎస్ (BRS)పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆ పార్టీ నుంచి నాయకులు వైదొలుగుతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా (mancherial)లోని బెల్లంపల్లి మున్సిపాలిటీ (bellampalli municipality) పరిధిలో ఆ పార్టీకి ఉన్న 21 మంది కౌన్సిలర్లలో 20 మంది రాజీనామా (20 councilors resigned from BRS) చేశారు. 

ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన ఆ పార్టీ నుంచి నాయకులు ఒక్కక్కొరుగా వదిలి వెళ్లిపోతున్నారు. ఆ పార్టీకి రాజీనామా చేసి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలోనూ అదే జరిగింది. 

పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసుంటే బీఆర్ఎస్ గెలిచేది - మాజీ మంత్రి కేటీఆర్

Latest Videos

మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపాలిటికి చెందిన 20 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు మూకుమ్మడిగా ఆ పార్టీని వీడారు. రాజీమాన చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా.. ఈ నాయకులు అంతా వారం రోజుల కిందట క్యాంపునకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు వారంతా కేటీఆర్ కు లేఖ రాశారు.

విమానం డోర్ తెరిచి దూకేసిన ప్రయాణికుడు..

కాగా.. వారంతా మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని మంచిర్యాల కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం మొత్తం 34 వార్డులు ఉండగా.. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది సభ్యులు గెలుపొందారు. ఒకరు బీజేపీ నుంచి విజయం సాధించారు. మిగిలిన 21 మంది ప్రస్తుత ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచే ఉన్నారు. అయితే వీరిలో 20 మంది ఒకే సారి రాజీనామాలు సమర్పించడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు దారి తీసింది. 

click me!