రాజయ్య vs నవ్య ఎపిసోడ్‌ : చర్యలు తప్పవు.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jun 27, 2023, 03:55 PM IST
రాజయ్య vs నవ్య ఎపిసోడ్‌ : చర్యలు తప్పవు.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య- సర్పంచ్ నవ్య వ్యవహారంపై స్పందించారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. విచారణ ముగిసిన తర్వాత పార్టీపరంగా చర్యలుంటాయని ఆయన తెలిపారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య- సర్పంచ్ నవ్య వ్యవహారంపై స్పందించారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. మంగళవారం జనగామ జిల్లా జఫర్గడ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవ్య ఆరోపణలపై ప్రభుత్వపరంగా పోలీసుల ద్వారా విచారణ జరుపుతున్నారని తెలిపారు. విచారణ ముగిసిన తర్వాత పార్టీపరంగా చర్యలుంటాయని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఆరోపణల్లో నిజానిజాలు తేలకుండా చర్యలు వుండవని ఆయన పేర్కొన్నారు. 

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు తాగు, సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 2003లోనే పనులను ప్రారంభించామని కడియం శ్రీహరి తెలిపారు. కానీ ఆనాటి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్ట్‌లు ముందుకు సాగలేదన్నారు. జిల్లాకు చెందిన పొన్నాల లక్ష్మయ్య భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా వున్నప్పటికీ ప్రజలకు న్యాయం జరగలేదని శ్రీహరి దుయ్యబట్టారు. ప్రస్తుతం వ్యవసాయ రంగానికి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశంసించారు. ఒకప్పుడు లక్ష మెట్రిక్ టన్నులు కూడా దిగుబడులు రాని.. జనగామ జిల్లాలో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని కడియం శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. 

Also Read: ఎమ్మెల్య వర్సెస్ సర్పంచ్ : వేధింపుల ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్.. నవ్యకు పోలీసుల నోటీసులు.. ఫోన్ సైలెంట్....

కాగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, సర్పంచ్ నవ్యల మధ్య నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య మీద జానకిపురం సర్పంచ్ నవ్య లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రెండు రోజుల క్రితం ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. అయితే,  ఈ ఆరోపణలను జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు సుమోటోగా స్వీకరించాయి. దీంతో కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. 

మహిళా కమిషన్లు ఈ కేసుకు సంబంధించిన విచారణ నివేదికను ఇవ్వాలంటూ పోలీసులను ఆదేశించింది. ఈ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  జానకీపురం సర్పంచ్ నవ్యకు పోలీసులు రెండు నోటీసులు జారీ చేశారు. నవ్య ఈ నెల 21వ తేదీన  ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో… ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఆయన పిఏ, నవ్య భర్త, ఎంపీపీల మీద ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన సాక్షాదారాలను రెండు రోజుల్లోగా సమర్పించాలని  కోరుతూ రెండు నోటీసులు జారీ చేశారు. 

దీనికి సంబంధించి మూడు రోజుల్లోగా సాక్షాలతో తమను సంప్రదించాలని.. విచారణకు సహకరించాలని ఏసీపీ కార్యాలయం నవ్యను కోరింది. ఫిర్యాదు టైంలో నవ్య మాట్లాడుతూ తనపై వేధింపులకు సంబంధించిన సాక్షాదారాలన్నీ తన దగ్గర ఉన్నాయని స్పష్టంగా తెలిపారు. ఈ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పిఏ శ్రీనివాస్, తన భర్తల మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, నవ్య ఫిర్యాదుపై పోలీసులు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలుస్తోంది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?