కమ్యూనిష్టుల భావజాలం ఎక్కడికి పోయింది?: ఈటలపై కడియం ఫైర్

Published : Jun 15, 2021, 01:14 PM IST
కమ్యూనిష్టుల భావజాలం ఎక్కడికి పోయింది?: ఈటలపై కడియం ఫైర్

సారాంశం

 కమ్యూనిష్టుల భావజాలం ఎక్కడికి పోయిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విమర్శలు గుప్పించారు. 

హైదరాబాద్:  కమ్యూనిష్టుల భావజాలం ఎక్కడికి పోయిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విమర్శలు గుప్పించారు. మంగళవారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తొలిరోజే ఈటలకు పరాభవం ఎదురైందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్ ఎందుకు చేరలేదో చెప్పాలని ఆయన కోరారు.  ఈటల రాజేందర్ లోని కమ్యూనిష్టు చనిపోయాడా అని ఆయన ప్రశ్నించారు. 

also read:నాకు ఈటల గతి పట్టదు: కేబినెట్ నుండి తొలగిస్తారనే ప్రచారంపై జగదీష్ రెడ్డి

తనపై నమోదైన కేసుల నుండి తప్పించుకోవడానికి ఆస్తులను రక్షించుకొనేందుకే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని ఆయన మండిపడ్డారు.తెలంగాణకు అన్ని విధాలుగా నష్టం చేసిన బీజేపీలో ఈటల రాజేందర్ ఎలా చేరాడని ఆయన ప్రశ్నించారు.  రాచరికపు, ఫ్యూడల్ కు ఉండాల్సిన భావాలు ఆస్తులు ఈటల రాజేందర్ కు ఉన్నాయని ఆయన చెప్పారు. 

ఇండిపెండెంట్ గా హుజూరాబాద్ లో పోటీ చేస్తే ఆ నియోజకవర్గ ప్రజలు ఆయనను బలపర్చేవారేమో... కానీ బీజేపీలో చేరడంతో ఆయనపై నియోజకవర్గ ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారని ఆయన మండిపడ్డారు.తెలంగాణకు కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్ష అని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ను బలపర్చాలని ఆయన కోరారు. పోరాటం చేయకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ఈటల రాజేందర్ చేరారని కడియం శ్రీహరి చెప్పారు.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం