కాచిగుడా ప్రమాదం: ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ మృతి

By telugu teamFirst Published Nov 16, 2019, 10:41 PM IST
Highlights

కాచిగుడా ప్రమాదంలో గాయపడి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ మరణించారు. ఈ నెల 11వ తేదీన హంద్రీ ఎక్స్ ప్రెస్ రైలును ఎంఎంటీఎస్ ఢీకొన్న ఘటనలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు.

హైదరాబాద్: ప్రమాదానికి గురైన ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ మరణించారు. హైదరాబాదులోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. చంద్రశేఖర్ మృతిని వైద్యులు ధ్రువీకరించారు.

ఈ నెల 11వ తేదీన కాచిగుడా రైల్వే స్టేషన్ సమీపంలో హంద్రీ ఎక్స్ ప్రెస్ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొటటింది. ఈ ఘటనలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. రైలును ఢీకొన్న ఘటనలో చంద్రశేఖర్ కిడ్నీలతో పాటు శరీరంలోని కీలకమైన భాగాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. 

Also Read: హైదరాబాదులో రెండు రైళ్లు ఢీ: లోకో పైలట్ దే తప్పిదం

రెండు రైళ్ల మధ్య చంద్రశేఖర్ శరీరం నలిగిపోయింది. గురువారంనాడు చంద్రశేఖర్ కాలును వైద్యులు తొలగించారు. హంద్రీ ఎక్స్ ప్రెస్ వెళ్లడానికి ఇచ్చిన సిగ్నల్ ను గమనించకుండా చంద్రశేఖర్ ఎంఎంటీఎస్ రైలును ముందుకు నడిపించాడని కాచిగుడా రైల్వే స్టేషన్ మేనేజర్ దశరథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కాచిగుడా రైల్వే స్టేషన్ లో సిగ్నలింగ్ లోపం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని మొదట భావించారు. రెడ్ సిగ్నల్ ను చూడకుండా చంద్రశేఖర్ ఎంఎంటీఎస్ రైలును ముందుకు నడిపించాడని, దానివల్లనే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రకటించారు కూడా. గత ఐదు రోజులుగా చికిత్స పొందుతూ చంద్రశేఖర్ తుదిశ్వాస విడిచారు.

Also Read: ఎంఎంటీఎస్ రైలు ప్రమాదం:లోకో పైలట్ చంద్రశేఖర్ కుడి కాలు తొలగింపు

click me!