KA Paul: 'దొంగలు, గజ దొంగలు, కుటుంబ పాలన కావాలంటే.. మీ ఇష్టం'

KA Paul: తెలంగాణలో ఎన్నికల నగారా మోగడంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల హడావిడిలో మునిగిపోయారు. ఈ తరుణంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ.. అందరి ద్రుష్టిని ఆకర్షిస్తున్నారు. తనను అందరూ సికింద్రాబాద్ నుంచి పోటీ చేయమని అడుగుతున్నారని అన్నారు.  


KA PAL: తెలంగాణలో ఎన్నికల నగారా మోగడంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నాయి. ఒకరిని మించి ఒకరు వ్యూహాత్మకంగా ఎత్తుకు పై ఎత్తు వేస్తూ.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి  సిద్దమవుతున్నారని అన్నారు. ఒక పక్క అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపిలు హోరా హోరీగా ఎన్నికలలో తలపడుతుంటే.. మరొక పక్క బిఎస్పి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తో పాటు, కేఏపాల్ ప్రజాశాంతి పార్టీలు కూడా తెలంగాణ ఎన్నికల సమరంలో తమ సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల బరిలో దిగనున్నాయి. 

ఈ ఎన్నికల హడావిడిలో ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ.. అందరి ద్రుష్టిని ఆకర్షిస్తున్నారు. వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా కేఏ పాల్ ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిమాణాలపై విద్యార్థులతో చర్చించారు. ఆ తర్వాత ప్రవళిక ఆత్మహత్యకు నిరసనగా ర్యాలీలో కూడా పాల్గొన్నారు. ప్రవళిక ఆత్మహత్య బాధాకరం, ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని కేఏ పాల్ సూచించారు. 

Latest Videos

ఇదిలా ఉంటే.. తనను అందరూ సికింద్రాబాద్ నుంచి పోటీ చేయమని అడుగుతున్నారని అన్నారు. తెలంగాణలో పాలన మారాలని కేఏ పాల్ అన్నారు. ప్రజలందరూ మద్దతు ఇస్తే.. సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తానని కేఏ పాల్ తెలిపారు. అలా కాకుండా దొంగలు, గజ దొంగలు, కుటుంబ పాలన కావాలంటే మీ ఇష్టమని పేర్కొన్నారు. 2014లో ధనవంతంగా ఉన్న రాష్ట్రం.. 2023 వచ్చే సరికి అప్పుల ఊబిలో పడిపోయిందనీ, ఈ  పరిస్థితి తాను ఎప్పుడూ ఊహించలేదని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. రాష్ట్రానికి 7 వేల కంపెనీలు తీసుకుని రాగలనని తెలిపారు. మన దేశంలో ఎంతో చైతన్యవంతులు ఉన్నారని.. కానీ మంచి చేసే రాజకీయ నాయకులు లేరని కేఏ పాల్ అసహనం వ్యక్తం చేశారు.  

click me!