కేసీఆర్ మరో పదేళ్లు సీఎంగా ఉండాలి: కేకే

By rajesh yFirst Published Sep 2, 2018, 6:42 PM IST
Highlights

నాలుగున్నరేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు వివరించాలన్న లక్ష్యంతో ప్రగతి నివేదన సభను నిర్వహించినట్లు టీఆర్ఎస్ ఎంపీ కేకే స్పష్టం చేశారు. నిజమైన న్యాయనిర్ణేతలు ప్రజలు కాబట్టే తాము చేసిన అభివృద్ధిని మీకు విన్నవించుకోవాలుకుంటున్నామని తెలిపారు. 

హైదరాబాద్: నాలుగున్నరేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు వివరించాలన్న లక్ష్యంతో ప్రగతి నివేదన సభను నిర్వహించినట్లు టీఆర్ఎస్ ఎంపీ కేకే స్పష్టం చేశారు. నిజమైన న్యాయనిర్ణేతలు ప్రజలు కాబట్టే తాము చేసిన అభివృద్ధిని మీకు విన్నవించుకోవాలుకుంటున్నామని తెలిపారు. 

రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లు కాదు రెండేళ్లే పాలించిందని తెలిపారు.  ఎక్కడ ఏ కార్యాలయం ఉందో తెలుసుకోవడానికి రెండేళ్లు సరిపోయింది. 

అవన్నీ తట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపాం. ఇప్పటి వరకు 500 ప్రభుత్వ సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల, బడుగుల ప్రభుత్వమని కేకే అన్నారు. ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీకి సహకరించాలని కోరారు. 

మరో పదేళ్లు కేసీఆర్ సీఎంగా ఉంటే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందని...స్వర్ణ తెలంగాణ స్వర్గ తెలంగాణ అవుతుందని కేకే ఆశాభావం వ్యక్తం చేశారు.  


 

click me!