ప్రగతి నివేదన సభ వేదికపై సీఎం కేసీఆర్

Published : Sep 02, 2018, 06:30 PM ISTUpdated : Sep 09, 2018, 11:19 AM IST
ప్రగతి నివేదన సభ వేదికపై సీఎం కేసీఆర్

సారాంశం

టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదన సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ప్రగతి భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయం చేరుకున్న కేసీఆర్ అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కొంగరకొలన్ కు చేరుకున్నారు. హెలిపాడ్ వద్ద పలువురు మంత్రులు ఎంపీలు స్వాగతం పలికారు. 

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదన సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ప్రగతి భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయం చేరుకున్న కేసీఆర్ అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కొంగరకొలన్ కు చేరుకున్నారు. హెలిపాడ్ వద్ద పలువురు మంత్రులు ఎంపీలు స్వాగతం పలికారు. 

వేదిక వద్దకు చేరుకున్న కేసీఆర్ కు ప్రజలు జేజేలు పలికారు. జై కేసీఆర్ జై టీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు. వేదికపై ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ నేతలకు ప్రతీ ఒక్కరికి అభివాదం తెలిపారు. ఆ తర్వాత వేదిక మెుత్తం కలియతిరిగి ప్రజలకు అభివాదం చేశారు. 

అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు. వేదికై డిప్యూటీ సీఎం మహమూద్ అలీ దట్టీ కట్టారు. మంత్రి మహేందర్ రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?