Huzurabad Bypoll: అతి సామాన్యుడిలా ఆర్థిక మంత్రి... రోడ్డుపక్కన టిఫిన్ చేసిన హరీష్ రావు (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Oct 11, 2021, 12:07 PM IST
Huzurabad Bypoll: అతి సామాన్యుడిలా ఆర్థిక మంత్రి... రోడ్డుపక్కన టిఫిన్ చేసిన హరీష్ రావు (వీడియో)

సారాంశం

ఆర్థిక మత్రిగా వున్నా అతి సామాన్యుడిలా రోడ్డుపక్కన ఓ చిన్న హోటల్లో టిపిన్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసారు మంత్రి హరీష్ రావు. 

కరీంనగర్: ఆయన రాష్ట్రానికి ఆర్థిక మంత్రి... ముఖ్యమంత్రికి స్వయానా మేనల్లుడు. ఇంత పెద్ద పదవి, కుటుంబనేపథ్యం కలిగినా ఆయనెప్పుడూ గొప్పలకు పోలేదు. తన హోదాను సైతం పక్కనపెట్టి అతి సామాన్యుడిలా నిత్యం ప్రజల్లో వుంటుంటారు. మరీ ముఖ్యంగా నిరుపేదలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తూ వారిలో ఒకరిలా కలిసిపోతుంటారు. అందుకే ఆయ్యన్నంతా మాస్ లీడర్ అంటుంటారు. నిజంగానే తాను మాస్ లీడర్ అని మరోసారి నిరూపించుకున్నారు హరీష్ రావు. 

huzurabad bypoll నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు మంత్రి harish rao. ఈ క్రమంలో హుజురాబాద్ లోనే మకాం వేసిన ఆయన అక్కడి ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అతి సామాన్యుడిలా ప్రజలతో మమేకం అవుతున్నారు. 

తాజాగా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లంత కుంట మండలం రాచపల్లి గ్రామంలో ప్రచారానికి వెళుతూ మరివాని పల్లిలో మంత్రి హరీష్ కాన్వాయ్ ఆగింది. కారులోంచి దిగిన మంత్రి నేరుగా  రోడ్డుపక్కన ఓ టిఫిన్ సెంటర్ వద్దకు వెళ్లి అందరికీ దోసెలు ఆర్డర్ చేసారు. తన టిఫిన్ సెంటర్ వద్దకు స్వయంగా మంత్రి రావడంతో ఆనందించిన యజమాని టిఫిన్ చేయడానికి సిద్దపడటంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. 

వీడియో

హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు మిగతా టీఆర్ఎస్ నాయకులు రోడ్డుపక్కనే కూర్చుని టిపిన్ చేసారు. దోసె రుచికరంగా వుందని... మళ్ళీ వచ్చి ఇక్కడే బోజనం కూడా చేస్తానని మంత్రి హరీష్ అనడంతో ఆ టిఫిప్ సెంటర్ యజమానితో పాటు అక్కడ పనిచేసేవారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 

read more  Huzurabad Bypoll: ఇస్త్రీపెట్టె చేతబట్టి, ఇంటింటికి తిరుగుతూ... మంత్రి గంగుల ప్రచార జోరు

టిఫిన్ చేస్తూ హోటల్ యజమానితో ఆత్మీయంగా మాట్లాడారు హరీష్ రావు. ఇక్కడ అన్ని ఆహార పదార్థాలు బాగుంటాయటగా...పెద్ద పెద్ద దావత్ లకు కూడా ఇక్కడి నుండి వండిపించుకొని పోతారట కదా...!!  అని అడిగారు. అందరూ చెబితేఏమో అనుకున్నా... కానీ నిజంగానే టిఫిన్ చాలా రుచిగా వుందంటూ మంత్రి హరీష్ రావు హోటల్ యజమానిని అభినందించారు.

మంత్రి రాకతో టిపిన్ సెంటర్ యజమానితో పాటు అక్కడ పనిచేసేవారు ఉద్వేగానికి గురయ్యారు.   హోటల్ యజమాని కుటుంబ సమేతంగా మంత్రితో ఫోటో దిగారు. తమ గ్రామానికి వచ్చిన మంత్రి అతి సామాన్యుడిలో రోడ్డుపక్కన టిఫిన్ చేయడాన్ని చూసి మరివాని పల్లి ప్రజలు కూడా మురిసిపోయారు. హరీష్ రావును ఇందుకే కదా మాస్ లీడర్ అనేది అని గ్రామస్తులు అనుకుంటున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు