తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంఎస్ రామచంద్రరావు

By Siva KodatiFirst Published Aug 27, 2021, 5:49 PM IST
Highlights

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వున్న జస్టిస్‌ హిమా కోహ్లి పదోన్నతిపై సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ రామచంద్రరావును ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది

Also Read:కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం... సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులు, 33కి చేరిన జడ్జిల సంఖ్య

కాగా, సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం ఆమోదం తెలిపారు. వీరి నియామకంతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 33కి పెరనుండగా.. ఒకే ఒక్క ఖాళీ మాత్రమే మిగులుతుంది. వీరు త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక సుప్రీంకోర్టు చరిత్రలో ఒకేసారి 9 మంది న్యాయమూర్తులను, అందులోనూ ముగ్గురు మహిళా న్యాయమూర్తులను నియమించడం ఇదే ప్రథమం.
 
click me!