దిశ కేసులో నిందితులను పది రోజులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ షాద్‌నగర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసులో సమగ్ర దర్యాప్తు కోసం నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
దిశ కేసులో నిందితులను పది రోజులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ షాద్‌నగర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసులో సమగ్ర దర్యాప్తు కోసం నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
ఈ వ్యవహారాన్ని పోలీసులు, కోర్టు అధికారులు అత్యంత గోప్యంగా ఉంచినట్లుగా తెలుస్తోంది. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన తర్వాత ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైన నేపథ్యంలో కస్టడీ విషయాన్ని గోప్యంగా ఉంచారు.
undefined
Also Read:జస్టిస్ ఫర్ దిశ: మొబైల్ ఫోన్ దొరకలేదు, 10 రోజుల కస్టడీ కోరిన పోలీసులు
కోర్టు సమయం ముగిసిన తర్వాతే ఆదేశాలు రావడం గమనార్హం. పది రోజుల కస్టడీ సమయంలో పూర్తి స్థాయిలో విచారణ చేయడంతో పాటు చార్జీషీటుకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు ప్రయత్నించనున్నారు.
జస్టిస్ ఫర్ దిశ హత్య కేసులో నిందితుల నుండి సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉందని షాద్‌నగర్ పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పది రోజుల పాటు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. కస్టడీ పిటిషన్‌లో పోలీసులు పలు విషయాలను ప్రస్తావించారు
నిందితులను రిమాండ్‌కు తరలించే సమయంలో వేలాది మంది పోలీస్‌స్టేషన్‌కు రావడంతో ఈ కేసు విషయంలో సమగ్రంగా దర్యాప్తు చేయలేకపోయినట్టుగా పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ కేసు విషయమై సమగ్రమైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు.
Also Read:Justice for Disha: నిందితుడికి ప్రాణాంతక వ్యాధి, ఆర్నెళ్లకోసారి..
ఈ కేసులో కీలకమైన మొబైల్ ఫోన్ ఇంకా స్వాధీనం చేసుకోలేకపోయినట్టుగా పోలీసులు చెప్పారు. నిందితులను సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉన్నందున వారిని తమ కస్టడీకి ఇవ్వాలని షాద్‌నగర్ పోలీసులు కోర్టును కోరారు. జస్టిస్ ఫర్ దిశ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళ సంఘాలు, యువత కోరుతున్నారు.