పెప్పర్ స్ప్రే వద్దు కత్తిపట్టండి, వేధిస్తే చంపెయ్యండి: సినీనటి ఆగ్రహం

By Nagaraju penumala  |  First Published Dec 2, 2019, 5:46 PM IST

అమ్మాయిలు, మహిళలు ఎవరైనా సరే ఇక నుంచి పెప్పర్ స్ప్రే వాడకూడదనేదే తన సూచన అన్నారు. వెపన్స్ తీసుకెళ్లాల్సిందేనని సూచించారు. మగవాళ్లు చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుని మహిళలను చంపేస్తుంటే తాము ఊరుకోవాలా అంటూ మాధవీలత ప్రశ్నించారు. కత్తులతో తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వైద్యురాలు దిశ హత్యపై సినీనటి, బీజేపీ నేత మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నికల్ గా దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నా మహిళలను కాపాడటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. 

ఓ ప్రముఖ ఛానెల్ లో డిబేట్ లో పాల్గొన్న మాధవీలత పోలీస్, న్యాయవ్యవస్థలపై కాస్త అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తిడుల నేపథ్యంలో న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం లేదని విమర్శించారు. 

Latest Videos

వరంగల్ ఘటన చోటు చేసుకున్నప్పుడు ఆనాటి సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి మూడు రోజుల్లో నిందితులకు కఠిన శిక్ష వేశారని తెలిపారు. మూడు రోజుల్లో ఎన్ కౌంటర్ చేయించి మహిళలకు ఒక భరోసా ఇచ్చారని గుర్తు చేశారు సినీనటి మాధవీలత.
 
ప్రస్తుతం అలాంటి నిర్ణయాలు తీసుకునే నాయకత్వం కరువైందన్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఇలాంటి తరుణంలో కఠిన శిక్షలు విధిస్తే అలాంటివి రిపీట్ కావన్నారు. 

Justice for Disha: నిందితుడికి ప్రాణాంతక వ్యాధి, ఆర్నెళ్లకోసారి

నేరం చేసిన నిందితులను ఎన్ కౌంటర్ చేయకుండా పటిష్టమైన బందోబస్తుతో సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారని ఆమె మండిపడ్డారు. ఒక యువతిపై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితులను భద్రత నడుమ జైలుకు తీసుకెళ్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మహిళలు, అమ్మాయిలు కూడా రేపటి నుంచి కత్తులు పెట్టుకుని తిరగాలా అంటూ నిలదీశారు. తమపై దాడికి పాల్పడితే వారిని చంపేయ్యాల్సిందేనా అంటూ మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇకపై అమ్మాయిలు బయటకు వెళ్తే పెప్పర్ స్ప్రేలాంటివి కాకుండా కత్తులు పట్టుకుని వెళ్లాలని మాధవీలత సూచించారు. ఎవరైనా వేధిస్తే కత్తులతో దాడి చేయాలని సూచించారు. అప్పుడు పోలీసులు వదిలేస్తే సమాజంలో మార్పు వస్తుందన్నారు. 

మానవ మృగాల చేతుల్లో మహిళ బలవుతూనే ఉందని వారికి శిక్ష పడకుండా చట్టంలోని లోపాలు కాపాడుతున్నాయంటూ ఆగ్రహంతో రగిలిపోయారు. ఆడపిల్ల ఒక చండీలా ఉండాలన్నారు. మహం కాళీలా మారితేనే ఈ ఘటనలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనన్నారు. 

ఆ నలుగురిని లాక్కొచ్చి ప్రజలకు అప్పగిస్తే తెలుస్తుంది: దిశ ఘటనపై జయాబచ్చన్

అమ్మాయిలు, మహిళలు ఎవరైనా సరే ఇక నుంచి పెప్పర్ స్ప్రే వాడకూడదనేదే తన సూచన అన్నారు. వెపన్స్ తీసుకెళ్లాల్సిందేనని సూచించారు. మగవాళ్లు చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుని మహిళలను చంపేస్తుంటే తాము ఊరుకోవాలా అంటూ మాధవీలత ప్రశ్నించారు. కత్తులతో తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 

ఎవరైతే మానవ మృగాలు యువతులుపైనా లేక మహిళలపైనా దాడులకు పాల్పడితే వారిపై కత్తులతో దాడికి దిగితేనే గానీ సమాజంలో మార్పు రాదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడే మానవమృగాల్లో మార్పు రావడంతోపాటు దాడులు కూడా తగ్గుతాయని సినీనటి మాధవ అభిప్రాయపడ్డారు. 
చర్లపల్లి జైల్లో దిశ హత్యకేసు నిందితులు: తొలి రోజే మటన్ తో భోజనం

click me!