దిశ కేసులో కీలక మలుపు, నెలరోజుల్లోనే శిక్ష: మహబూబ్ నగర్ లో తొలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు

By Nagaraju penumalaFirst Published Dec 4, 2019, 8:36 PM IST
Highlights

మహబూబ్ నగర్ జిల్లాలో కోర్టుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసుకునేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది హైకోర్టు. అటు కేసీఆర్ ప్రభుత్వం సైతం నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది.  
 

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశ హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. దిశ రేప్, హత్య ఘటనపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు అయ్యింది. 

దిశపై జరిగిన దారుణంపై విచారించేందుకు మహబూబ్ నగర్ జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అటు ప్రభుత్వం మరోవైపు హైకోర్టు అంగీకారం తెలిపింది. మహబూబ్‌నగర్ మొదటి అదనపు సెషన్స్, జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా ప్రకటించింది.  

ఈ కేసు విచారణకు సంబంధించి ప్రత్యేకంగా న్యాయమూర్తి, స్పెషల్ పీపీ నియామకాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు. ఇకపోతే దిశ రేప్ హత్య కేసులో నిందితులకు వెంటనే శిక్ష వేసేందుకు ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టును అనుమతి కోరింది. 

ఇకపోతే దిశ ఉదంతంపై దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ ఫర్ దిశ అంటూ ఆందోళనలు చేస్తున్నారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కోర్టులు అంటూ కాలయాపన చేయకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. 

Justice for Disha: పోలీస్ కస్టడీకి దిశ హత్య కేసు నిందితులు

దాంతో కేసీఆర్ ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు కోరుతూ హైకోర్టుకు లేఖ రాసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొంది. లేఖపై హైకోర్టు లా సెక్రటరీ సంతోష్ లేఖ రాశారు. దాంతో హైకోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుపై న్యాయస్థానం అనుకూలంగా ప్రకటన చేసింది.  

మహబూబ్ నగర్ జిల్లాలో కోర్టుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసుకునేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది హైకోర్టు. అటు కేసీఆర్ ప్రభుత్వం సైతం నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది.  

దిశ హత్యకేసులో నిందితులు నలుగురు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వారే. ఇకపోతే వైద్యురాలు సైతం మహబూబ్ నగర్ జిల్లాలోనే విధులు నిర్వహిస్తోంది. అటు ఘటన కూడా అక్కడే చోటు చేసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 

దేశవ్యాప్తంగా దిశ హత్యకేసు సంచలనం సృష్టించడంతోపాటు రోజురోజుకు నిరసనలు తీవ్ర తరం కావడంతో  నెలరోజుల్లోనే నిందితులకు శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. 


 Justice For Disha:మహాబూబ్‌నగర్‌లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు

కేవలం దిశ ఘటనను మాత్రమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించనుంది. ఈ కేసును పూర్తిగా విచారించిన అనంతరం నెలరోజుల్లో నిందితులకు శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది. అందువల్లే ప్రజలు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ప్రజలు కోరడం జరిగింది.

ఇకపోతే వరంగల్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనపై ప్రత్యేక ఫాస్ట్‌‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దాంతో కేవలం 56 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించింది. అదే తరహాలో దిశ కేసులోనూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుతో సత్వర తీర్పు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 

click me!