కేసీఆర్ హామీ.. సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు

By Siva KodatiFirst Published May 27, 2021, 7:29 PM IST
Highlights

జూనియర్ డాక్టర్లు సమ్మె విరమిస్తున్నట్లుగా ప్రకటించారు. సీఎం కేసీఆర్ సానుకూల స్పందనతో సమ్మె విరమించామని వారు తెలిపారు. సీనియర్ రెసిడెంట్లకు 15 శాతం స్టైఫండ్ పెంచింది ప్రభుత్వం. 
 
జూనియర్ డాక్టర్లు సమ్మె విరమిస్తున్నట్లుగా ప్రకటించారు. సీఎం కేసీఆర్ సానుకూల స్పందనతో సమ్మె విరమించామని వారు తెలిపారు. సీనియర్ రెసిడెంట్లకు 15 శాతం స్టైఫండ్ పెంచింది ప్రభుత్వం. 

అంతకుముందు జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌‌తో తెలంగాణ ప్ర‌భుత్వం జ‌రిపిన చ‌ర్చ‌లు ముగిశాయి. ప్ర‌భుత్వం నుంచి త‌మ‌కు లిఖిత పూర్వ‌క హామీ ఇవ్వ‌లేద‌ని జూడాలు తెలిపారు. స‌మ్మె విర‌మ‌ణ‌పై ఈ సాయంత్రం నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వారు వెల్లడించారు. అయితే ప్రభుత్వం కొన్ని డిమాండ్ల‌పై సానుకూలంగా స్పందించిన‌ట్లు జూడాలు స్ప‌ష్టం చేశారు.

Also Read:సమ్మె ఎఫెక్ట్: జూడాల స్టైఫండ్ భారీగా పెంపు.. తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు

ఉత్త‌ర్వుల జారీకి రెండు రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని సర్కార్ చెప్పిన‌ట్లు వివ‌రించారు. ప‌రిహారం విష‌యంలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయ‌ని ప్రభుత్వం  చెప్పిందన్నారు. ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌లిగించ‌కూడ‌ద‌నేదే త‌మ ఉద్దేశ‌మని అందుకే అత్య‌వ‌స‌ర సేవ‌లు కొన‌సాగిస్తున్నామ‌న్నారు.   

click me!