గాంధీలో జూనియర్ డాక్టర్లపై దాడి: రాష్ట్రంలో పలు చోట్లు జూడాల నిరసన

By narsimha lodeFirst Published Jun 10, 2020, 12:21 PM IST
Highlights

గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లపై  దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తగా పలు చోట్ల ఆసుపత్రుల ముందు జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లపై  దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తగా పలు చోట్ల ఆసుపత్రుల ముందు జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు.

కరోనా వైరస్ సోకి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి ఈ నెల 9వ తేదీన మృతి చెందాడు. దీంతో కరోనాతో మరణించిన రోగి బంధువులు జూనియర్ డాక్టర్లపై దాడికి దిగారు.  ఈ ఘటనలో ఇద్దరు జూనియర్ డాక్టర్లకు స్వల్పంగా గాయపడ్డారు.

గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లపై దాడిని నిరసిస్తూ  ఆదిలాబాద్, వరంగల్, గాంధీ ఆసుపత్రుల ముందు జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్లు గంట పాటు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఓపి నుండి రిమ్స్ వరకు ర్యాలీ నిర్వహించారు.

also read:గాంధీ ఆసుపత్రిలో డెడ్‌బాడీల తారుమారు : ఆగ్రహంతో డాక్టర్లను చితకబాదిన బంధువులు

వరంగల్ ఎంజీఎం ముందు జూనియర్ డాక్టర్లు ధర్నాకు దిగారు. విధులు బహిష్కరించారు. డాక్టర్లపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని కోరారు. గాంధీ ఆసుపత్రిలో కూడ జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. 

గతంలో కూడ గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో కూడ జూనియర్ డాక్టర్లపై రోగి బంధువులు దాడులకు దిగారు.ఈ ఘటనల్లో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్లపై దాడులు చేస్తే సహించమని ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. 

జూనియర్ డాక్టర్లపై దాడి చేసినవారిపై కేసు

జూనియర్ డాక్టర్లపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశామన్నారు. డాక్టర్లపై దాడి చేస్తే ఉపేక్షించబోమన్నారు.

click me!