తెలంగాణ: కొత్తగా 245 మందికి పాజిటివ్... రాష్ట్రంలో 6,65,749కి చేరిన కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Sep 29, 2021, 10:14 PM IST
తెలంగాణ: కొత్తగా 245 మందికి పాజిటివ్... రాష్ట్రంలో 6,65,749కి చేరిన కేసుల సంఖ్య

సారాంశం

తెలంగాణలో కొత్తగా 245 కరోనా కేసులు నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు మరణించారు. 173 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 4,620 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 52,683 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 245 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,65,749కి చేరాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో వైరస్ వల్ల ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 3,916కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 173 మంది మహమ్మారి నుంచి కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,57,213కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 4,620 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 3, భద్రాద్రి కొత్తగూడెం 5, జీహెచ్ఎంసీ 73, జగిత్యాల 6, జనగామ 2, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల 2, కామారెడ్డి 0, కరీంనగర్ 21, ఖమ్మం 12, మహబూబ్‌నగర్ 4, ఆసిఫాబాద్ 2, మహబూబాబాద్ 2, మంచిర్యాల 10, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 13, ములుగు 2, నాగర్ కర్నూల్ 2, నల్గగొండ 15, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 1 , పెద్దపల్లి 6, సిరిసిల్ల 4, రంగారెడ్డి 14, సిద్దిపేట 5, సంగారెడ్డి 4, సూర్యాపేట 6, వికారాబాద్ 3, వనపర్తి 1, వరంగల్ రూరల్ 5, వరంగల్ అర్బన్ 16, యాదాద్రి భువనగిరిలో 5 చొప్పున కేసులు నమోదయ్యాయి.

 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ట్రాఫిక్ క‌ష్టాల‌కు ఇక చెక్‌.. హైద‌రాబాద్‌లో భూగ‌ర్భంలో రోడ్ల నిర్మాణం
PMMVY Scheme : తెలుగు మహిళలకు బంపరాఫర్.. ప్రభుత్వమే ఫ్రీగా రూ.6,000 అకౌంట్లో వేసే సూపర్ స్కీమ్