Hyderabad : హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పదేండ్ల బాలుడి అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఇదే ప్రాంతంలోని ఓ వృద్ధుడు తన కామావాంఛ తీర్చుకునేందుకు బాలుడికి మాయ మాటలు చెప్పి పార్కుకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపేసి దారుణంగా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.
Hyderabad : కామంతో కళ్లుమూసుకుపోయిన కొందరూ మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. చిన్న, పెద్ద.. ఆడ, మగ అనే తేడా లేకుండా.. విక్షణరహితంగా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఒంటరిగా ఉన్న ఆడ మగ పిల్లలకు మాయమాటలు చెప్పి వారితో లైంగిక కోరికలు తీర్చుకుంటున్నారు. ఎక్కడ తమ బాగోతం బయటపడుతుందనే భయంతో అన్యాయంగా ఆ చిన్నారులను చంపేస్తునున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇలాంటి ఘటననే హైదరాబాద్ నగరం నడిబొడ్డున వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన పదేళ్ల బాలుడి కేసు విషయంలో దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఓ వృద్ధుడు తన కామావాంఛ తీర్చుకునేందుకు ఓ బాలుడికి మాయ మాటలు చెప్పి పార్కుకు తీసుకెళ్లాడు. బాలుడు గట్టిగా కేకలు వేయటంతో చిన్నారి గొంతు నులిమి చంపేసి దారుణంగా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్ 5 లోని దుర్గా భవానీ నగర్ బస్తీవాసి ముడావత్ రమేష్, కవిత రెండో కుమారుడు కార్తీక్ అలియాస్ పండు (10)ఈ నెల 13న రాత్రి కిరాణా షాప్ కి వెళ్లాడు. ఎంతసేపటికి కార్తీక్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది బంధువుల సాయంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతికారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆ తల్లిదండ్రులు అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరుసటి రోజు భవానీ నగర్ పార్కులోని ఓ డ్రైనేజీ నాలాలో ఆ బాలుడి మృతదేహాం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు.
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలుడి కేసును మరింత లోతుగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే అదే బస్తీకి చెందిన మన్యం నాయక్ అనే వృద్దుడిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అలాగే..బాలుడు మృతి చెందిన నాటి నుంచి ఆ వృద్దుడు అందుబాటులో లేకపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. పరారీలో ఉన్న ఆ వృద్దుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం బయటపడింది. తన కామవాంఛ తీర్చుకునేందుకు బాలుడిని కిడ్నాప్ చేసి పార్క్ కి తీసుకువెళ్లాడు. బాలుడు గట్టిగా కేకలు వేయడంతో భయంతో గొంతు నులిమి చంపేసి నాలాలో పడేసి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది.