Hyderabad: పంటి చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే యువకుడు చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో దారుణం జరిగింది. పంటి చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే యువకుడు చనిపోవడం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. డాక్టర్ నిర్లక్షం వల్లనే తన కుమారుడి ప్రాణం పోయిందని మృతుడి తండ్రి ఆరోపించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో కంప్లైట్ చేశాడు.
వివరాల్లోకి వెళితే.. మిర్యాలగూడకు చెందిన వింజం లక్ష్మీనారాయణ (28) తన కుటుంబంతో కూకట్‌పల్లి సమీపంలోని హైదర్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 15న ఆయనకు నిశ్చితార్థం జరిగింది. మార్చి 13న పెళ్లి. ఈ తరుణంలో లక్ష్మీనారాయణ పంటినొప్పి ఉండటంతోపాటు తన పళ్లను సరిచేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయగా.. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 37లోని ఎఫ్‌ఎంఎస్ డెంటల్ హస్పిటల్ బెటర్ అనుకున్నాడు.
తన నిశ్చితార్థం అయిన మరుసటి రోజు (ఫిబ్రవరి 16న)ఎఫ్‌ఎంఎస్ డెంటల్ హాస్పిటల్ కు వెళ్లాడు. పంటికి రూట్ కెనాల్ ట్రిట్ మెంట్ తో పాటు .. దంతాలు వంకరటింకరను సరిచేయడానికి లేజర్ ట్రీట్‌మెంట్ ఉంటుందని చెప్పగా..అందుకు లక్ష్మీనారాయణ అంగీకరించాడు. చికిత్స క్రమంలో నొప్పి కలగకుండా ఉండేందుకు అనస్తీషీయా ఇచ్చారు. ఈ క్రమంలో అతడు వాంతులు చేసుకుంటూ.. ఫిట్స్ వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. ఈ ఘటనతో ఆందోళనకు గురైన ఎఫ్‌ఎంఎస్ హాస్పిటల్ సిబ్బంది వెంటనే అంబులెన్స్‌లో అపోలో హాస్పట్ కి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.
అతడి మృతిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయాడని, అనస్తీషీయా డోస్ ఎక్కువగా ఇచ్చారని, దాని వల్లనే తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆసుపత్రి ఎదుట ఆందోళన చెపట్టారు. అనంతరం జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. తన కుమారుడి ప్రాణం తీసిన ఆసుపత్రి, డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాలంటే హిస్టో పాథాలజీ నివేదిక రావాల్సిందేనని, నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.