
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా (JP Nadda) రేపు(జనవరి 4) హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన నాలుగు రోజుల పాటు ఆయన ఇక్కడే ఉండనున్నారు. జనవరి 5 నుంచి మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ సమీపంలోని అన్నోజిగూడలో జరగనున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (Rashtriya Swayamsevak Sangh) కీలక సమావేశాల్లో జేపీ నడ్డా పాల్గొననున్నారు. ఈ సమావేశాలు 7వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందుకోసం జేపీ నడ్డా మంగళవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు.
జేపీ నడ్డా పర్యటన నేపథ్యంలోనే చేయాల్సిన ఏర్పాట్లపై ఆదివారం నాంపల్లిలో బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సమావేశం అయ్యారు. బండి సంజయ్ (Bandi Sanjay) కరీంనగర్‌లో దీక్ష నేపథ్యంలో ఈ సమావేశానికి రాలేదు. ఈ క్రమంలోనే ఇతర సీనియర్ నాయకులు జేపీ నడ్డా పర్యటనను విజయవంతంగా నిర్వహించేందకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. నడ్డాకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలకాలని రాష్ట్ర పార్టీ నేతలు నిర్ణయించారు.
Also Read: Bandi Sanjayపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు.. కరీంనగర్‌లో టెన్షన్
జాతీయస్థాయిలో జరిగే ఈ సమావేశాల్లో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో పాటు సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబలే, అయిదుగురు సహ కార్యవాహ్‌లతో పాటు వీహెచ్‌పీ, ఏబీవీపీ, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. భాజపా నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బి.ఎల్.సంతోష్‌తో పాటు సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ హాజరు కానున్నారు. రెస్సెస్ ఆధ్వర్యంలో ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాలు, నిర్వహణ, వాటిలో ఏబీవీపీ, బీఎంఎస్, బీకేఎస్, తదితర సంఘాల భాగస్వామ్యం, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు.
మరోవైపు హైదరాబాద్‌కు పర్యటనుకు వస్తున్న జేపీ నడ్డాతో తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర బీజేపీ నేతలు చర్చించే అవకాశం ఉంది.