సూర్యాపేట మెడికల్ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం..

By SumaBala BukkaFirst Published Jan 3, 2022, 9:37 AM IST
Highlights

అతడి  దుస్తులు విప్పించి  సెల్ ఫోన్ లో వీడియో తీశారు.  అప్పటికే మద్యం తాగి ఉన్నవారు అతడిపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆగకుండా గుండు గీసేందుకు యత్నించగా భయాందోళనకు గురైన విద్యార్థి తప్పించుకుని తన గదికి వెళ్లాడు. వెంటనే బాధితుడు… తండ్రికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాడు.  

సూర్యాపేట :  సూర్యాపేటలోని Medical Collegeకు చెందిన హాస్టల్ లో ఒక student Raging కు గురైన ఉదంతం కలకలం సృష్టించింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ చెందిన ఓ విద్యార్థి ఇక్కడి వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇంటి నుంచి శనివారం రాత్రి Hostel కు చేరుకున్న అతడిని ద్వితీయ సంవత్సరానికి చెందిన దాదాపు 25 మంది విద్యార్థులు తమ గదిలోకి  రమ్మన్నారు.  

ఆ తరువాత కాసేపు పేరు, వివరాలు కనుక్కుని.. అతడి  దుస్తులు విప్పించి  సెల్ ఫోన్ లో వీడియో తీశారు.  అప్పటికే మద్యం తాగి ఉన్నవారు అతడిపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆగకుండా గుండు గీసేందుకు యత్నించగా భయాందోళనకు గురైన విద్యార్థి తప్పించుకుని తన గదికి వెళ్లాడు. వెంటనే బాధితుడు… తండ్రికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాడు.  

Latest Videos

కంగారు పడ్డ ఆయన వెంటనే  డయల్100కు ఫోన్ చేసి  ఫిర్యాదు చేయడంతో... స్థానిక పోలీసులు హాస్టల్ కు చేరుకుని ఆందోళనలో ఉన్న బాధితుడిని ఠాణాకు తరలించారు. అయితే  ర్యాగింగ్ చేసిన విద్యార్థులపై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడు, అతని తండ్రి ఆరోపిస్తున్నారు.

ఈ విషయమై Government General Hospital సూపర్డెంట్ మురళీధర్ రెడ్డిని వివరణ కోరగా.. విద్యార్థులు ఘర్షణ పడిన మాట వాస్తవమేనని.. విచారణకు నలుగురు  హెచ్ఓడిలను నియమించామన్నారు.  ర్యాగింగ్ కు పాల్పడినట్లు తేలితే కేసు నమోదు చేయాలని పోలీసులకు చెబుతామన్నారు. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామని ఇన్స్పెక్టర్ ఆంజనేయులు తెలిపారు. 

Bandi Sanjayపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు.. కరీంనగర్‌లో టెన్షన్

ఇదిలా ఉండగా, నవంబర్ లో వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో మరోసారి  ర్యాగింగ్ కలకలం రేగింది.సీనియర్ విద్యార్థులు.. జూనియర్లను ర్యాగింగ్ చేసస్తున్నారని ఓ విద్యార్థి ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర హోం మత్రి అమిత్ షా), తెలంగాణ మంత్రి కేటీఆర్, తదితరులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫ్రెషర్స్ డే పేరుతో సీనియర్లు దారుణంగా వేధిస్తున్నారని ఆ విద్యార్థి పేర్కొన్నారు. 

వివరాల్లోకి వెడితే.. కొత్త బ్యాచ్ విద్యార్థులకు ఆహ్వానం పలికేందుకు సెకండ్, థర్డ్ ఈయర్ విద్యార్థులు ప్రెషర్స్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి ఫోర్త్ ఈయర్ విద్యార్థులను కూడా ఆహ్వానించారు. జూనియర్ విద్యార్థులు సరైన గౌరవం ఇవ్వడం లేదంటూ కొందరు సీనియర్‌ విద్యార్థులు అనుచితంగా ప్రవర్తించినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు చెప్పిన పట్టించుకోవడం లేదనే కారణంతోనే ట్వీట్ చేసినట్టుగా సమాచారం.

కేఎంసీలో ర్యాగింగ్ తరహా చాలా ఘటనలు జరుగుతున్నాయి. దయచేసి కాపాడండి. వారంతా తప్ప తాగి జూనియర్ మెడికోల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా వరంగల్ కేఎంసీలోని న్యూమెన్స్ హాస్టల్-1లో జరుగుతోంది. దయ చేసి కాపాడండి’ అని విద్యార్థి ట్విట్టర్‌లో మోదీ, కేటీఆర్, ఇతర ప్రముఖులను కోరారు. 

అయితే కేఏంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మోహన్‌దాసు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. కాలేజీలో అలాంటి ఘటన ఏదీ చోటుచేసుకోలేదని, జూనియర్‌ విద్యార్థుల హాస్టల్‌కు సీనియర్ల హాస్టల్‌ భవనాలు చాలా దూరంగా ఉంటాయని తెలిపారు. మరోవైపు ఈ సంఘటన పైన మట్టేవాడ పోలీసులు న్యూమెన్స్ హాస్టల్లో ఏం జరుగుతోందనే దానిపై ఆరా తీశారు.

click me!