
గ్యాంగ్ స్టర్ నయీం అంశంపై సోమవారం తెలంగాణ అసెంబ్లీ అట్టుడికింది.
ప్రతిపక్షాలు అధికార టీఆర్ఎస్ పార్టీని ఈ విషయంపై ప్రశ్నించాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నయాం డైరీని బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తనదైన ప్రశ్నలతో అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కరి చేశారు. నయీం డైరీ బయటపడితే అందరి పాత్ర బయటకొస్తుందని అన్నారు.
జీవన్ రెడ్డి ప్రశ్నలకు స్పందించిన సీఎం కేసీఆర్ ... నయీం ఆస్తులు, కేసు విచారణ తదితరాలను వివరించారు.
వీటిపై స్పందించిన జీవన్ రెడ్డి కేసుతో సంబంధమున్న అధికారులను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని సీఎం ను ప్రశ్నించారు.
నయీం కేసుపై సీబీఐ విచారణ జరిపిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.