దేవుడికే వరమిచ్చిన కేసీఆర్

First Published Dec 18, 2016, 10:00 AM IST
Highlights
  • తనకు అచ్చొచ్చిన గుడికి కోట్లు విడుదల చేసిన సీఎం
  • కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామికి మహర్ధశ

ముఖ్యమంత్రి కేసీఆర్ కు దైవభక్తి చాలా ఎక్కువ. ఈ విషయం అందిరికీ తెలిసిందే. తాను మొదలుపెట్టే ప్రతి పనికి ముందు ముహుర్త బలం చూసుకొని మరీ ప్రారంభిస్తారు.

 

ఇక కేసీఆర్ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లిలోని వెంకటేశ్వరాలయం అంటే ప్రత్యేక సెంటిమెంట్. ఎప్పుడు సిద్దిపేట వచ్చిన కోనాయిపల్లి వచ్చి దేవుడి దర్శనం చేసుకోకుండా వెళ్లరు.

 

ఇన్నాళ్లు పెద్దగా  అభివృద్ధికి నోచుకొని ఈ ఆలయానికి ఇప్పుడు మహర్ధశ పట్టింది. ఈ గుడి విస్తరణను ఆదివారం ప్రారంభించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.3.5 కోట్లు కేటాయించింది. మొదటి విడతగా రూ.1.5 కోట్లు విడుదలయ్యాయి.

 

1985లో సిద్దిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ఎన్నికైనప్పటికీ నుంచి కోనాయిపల్లి వెంకటేశ్వరాలయం ఆయనకు సెంటిమెంట్‌గా మారింది. ఆలయం వద్దే నామినేషన్‌ పత్రాలపై కేసీఆర్‌ సంతకాలు చేసి.. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతే ఎన్నికల అధికారులకు సమర్పిస్తారు.

 

ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. 2004లో సిద్దిపేట శాసనసభ్యత్వానికి కేసీఆర్‌ రాజీనామా చేసిన తర్వాత అక్కడి నుంచి పోటీలోకి దిగిన హరీశ్‌రావు కూడా మామ అడుగుజాడల్లోనే నడిచారు.

 

ఆలయ ప్రాంగణం ఇరుకుగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆలయాన్ని విస్తరించాలని నిర్ణయించారు.

click me!