జయరాం హత్య కేసు: మరో పోలీస్ అధికారిపై వేటు,8మందిపై వేలాడుతున్న కత్తి

By Nagaraju penumalaFirst Published Feb 16, 2019, 8:44 PM IST
Highlights


ఇప్పటికే ఇద్దరు పోలీసులపై వేటు వెయ్యగా తాజాగా మరో పోలీస్ అధికారిపై వేటు పడింది. రాకేష్ రెడ్డి హత్య చేశాడని తెలిసి కూడా ఉదాసీనంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో రాయదుర్గం ఇన్ స్పెక్టర్ రాంబాబును బదిలీ చేస్తూ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 

హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసు పోలీస్ శాఖ మెడకు చుట్టుకుంది. జయరామ్ హత్య కేసులో నిందితుడు రాకేష్ కు 11 మంది పోలీసులు సహకరించారని తెలుస్తోంది. 

ఇప్పటికే ఇద్దరు పోలీసులపై వేటు వెయ్యగా తాజాగా మరో పోలీస్ అధికారిపై వేటు పడింది. రాకేష్ రెడ్డి హత్య చేశాడని తెలిసి కూడా ఉదాసీనంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో రాయదుర్గం ఇన్ స్పెక్టర్ రాంబాబును బదిలీ చేస్తూ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 

జయరాంను రాకేష్ రెడ్డి హత్య చేసిన తర్వాత రాయదుర్గం ఇన్ స్పెక్టర్ రాంబాబుకు పోన్ చేశారు. పోన్ చేసిన తర్వాత కూడా నిందితుడిని పట్టుకోవడంలో విఫలమైనందుకు రాయదుర్గం ఇన్ స్పెక్టర్ పై పోలీస్ శాఖ వేటు వేసింది. ఇప్పటి వరకు జయరాం హత్య కేసులో ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారులపై వేటు పడింది. 

నల్లకుంట ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ తోపాటు ఏసీపీ మల్లారెడ్డి తాజాగా రాయదుర్గం ఇన్ స్పెక్టర్ రాంబాబు వేటుకు గురయ్యారు. మరో 8 మందిపై విచారణ కొనసాగుతోంది. వారిపై కూడా ఏక్షణాన అయిన వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఈ వార్తలు కూడా చదవండి

తెలియక ఇరుక్కున్న నటుడు సూర్య: సినీతారలతో రాకేష్ రెడ్డికి లింక్స్

జయరాం హత్య: సిరిసిల్ల కౌన్సిలర్ భర్తను విచారిస్తున్న పోలీసులు

జయరాం హత్య: పోలీస్ విచారణ తర్వాత మీడియాతో శిఖా చౌదరి (వీడియో)

జయరామ్ హత్య: నటుడు సూర్యతో హానీట్రాప్

జయరామ్ హత్యలో నగేష్ పాత్ర: ఖాళీ బాండ్‌ పేపర్లపై సంతకాలు

జయరామ్ హత్య కేసు: ఏసీపీ ఆఫీసులో శిఖా చౌదరి విచారణ

జయరామ్ హత్య: అప్పు ఉత్తి మాటే, బలవంతపు వసూలుకే

జయరామ్ హత్య: జూ.ఆర్టిస్ట్ సహా మరో 9 మంది పోలీసుల పాత్రపై ఆరా

జయరామ్ మృతదేహంతో హైద్రాబాద్‌లో రాకేష్ రెడ్డి చక్కర్లు

click me!