జయరాం హత్యకేసులో రాకేశ్ రెడ్డికి సీఐ, ఏసీపీల సలహాలు: సాక్ష్యాలు లభ్యం, విచారణకు హాజరుకావాలని ఆదేశం

By Nagaraju penumalaFirst Published Feb 16, 2019, 9:11 PM IST
Highlights


అయితే మర్డర్ విషయం హైదరాబాద్ లో బయటపడితే పోలీస్ ఇన్విస్టిగేషన్ లో దొరికిపోతావని దాన్ని ప్రమాదంగా చిత్రీకరించాలని సూచించారు. అలాగే జయరాం మృతదేహాన్ని ఆంధ్రాలో పడేసి ప్రమాదంగా చిత్రీకరించాలని సూచించారు. మృతదేహాన్ని ఆంధ్రాలో పడేసిన తర్వాత అక్కడ పోలీసులను మేనేజ్ చెయ్యాలంటూ సూచించారు. 

హైదరాబాద్: ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరామ్ హత్య కేసు పోలీసుల మెడకు చుట్టుకుంది. జయరామ్ హత్య కేసులో నిందితుడు రాకేష్ రెడ్డికి సీఐ శ్రీనివాస్, ఏసీపీ మల్లారెడ్డిలు సలహాలు ఇచ్చినట్లు సాక్ష్యాలు లభించడంతో పోలీసులు ఇక విచారణకు రంగం సిద్ధం చేశారు. 

అందులో భాగంగా ఏసీపీ మల్లారెడ్డి, ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ లను విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరుకావాలని నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. జయరామ్ ను హత్య చేసిన తర్వాత నిందితుడు రాకేష్ రెడ్డిని కేసు నుంచి తప్పించేందుకు మర్డర్ ను కాస్త ప్రమాదంగా క్రియేట్ చేసేందుకు ఏసీపీ, సీఐ సలహాలు ఇచ్చారు. 

అందుకు  సంబంధించి సాక్ష్యాలు లభించడంతో సోమవారం విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే వీరిద్దరిపై బదిలీ వేటు వేసింది తెలంగాణ పోలీస్ శాఖ. ఇకపోతే జయరామ్ ను హత్య చేసిన తర్వాత రాకేష్ రెడ్డి ఏసీపీ, సీఐలకు కాల్ చేశాడు. 

అయితే మర్డర్ విషయం హైదరాబాద్ లో బయటపడితే పోలీస్ ఇన్విస్టిగేషన్ లో దొరికిపోతావని దాన్ని ప్రమాదంగా చిత్రీకరించాలని సూచించారు. అలాగే జయరాం మృతదేహాన్ని ఆంధ్రాలో పడేసి ప్రమాదంగా చిత్రీకరించాలని సూచించారు. మృతదేహాన్ని ఆంధ్రాలో పడేసిన తర్వాత అక్కడ పోలీసులను మేనేజ్ చెయ్యాలంటూ సూచించారు. 

అంతేకాదు జయరాం మద్యం తాగడం వల్ల కారు ప్రమాదానికి గురై చనిపోయారని నమ్మించేలా క్రియేట్ చెయ్యాలని ఆదేశించడంతో రాకేష్ రెడ్డి బీరు కొనుగోలు చేసి జయరాం మృతదేహం నోట్లో పోసి కారు వదిలేసి పరారయ్యాడని తేలింది. 

జయరాం హత్యకేసులో సాక్ష్యాలు తారుమారు చేసేలా పోలీస్ ఉన్నతాధికారులు ప్రవర్తించారని పోలీసులు గుర్తించారు. అందులో భాగంగా వారిని సోమవారం విచారణకు హాజరవ్వాలని ఆదేశించారు. విచారణలో హత్యకు సంబంధించిన విషయాలతోపాటు రాకేశ్ రెడ్డి నేర సామ్రాజ్యంపై కూడా ఆరా తియ్యనున్నట్లు తెలుస్తోంది. 

ఈ వార్తలు కూడా చదవండి

జయరాం హత్య కేసు: మరో పోలీస్ అధికారిపై వేటు,8మందిపై వేలాడుతున్న కత్తి

తెలియక ఇరుక్కున్న నటుడు సూర్య: సినీతారలతో రాకేష్ రెడ్డికి లింక్స్

జయరాం హత్య: సిరిసిల్ల కౌన్సిలర్ భర్తను విచారిస్తున్న పోలీసులు

జయరాం హత్య: పోలీస్ విచారణ తర్వాత మీడియాతో శిఖా చౌదరి (వీడియో)

జయరామ్ హత్య: నటుడు సూర్యతో హానీట్రాప్

జయరామ్ హత్యలో నగేష్ పాత్ర: ఖాళీ బాండ్‌ పేపర్లపై సంతకాలు

జయరామ్ హత్య కేసు: ఏసీపీ ఆఫీసులో శిఖా చౌదరి విచారణ

జయరామ్ హత్య: అప్పు ఉత్తి మాటే, బలవంతపు వసూలుకే

జయరామ్ హత్య: జూ.ఆర్టిస్ట్ సహా మరో 9 మంది పోలీసుల పాత్రపై ఆరా

జయరామ్ మృతదేహంతో హైద్రాబాద్‌లో రాకేష్ రెడ్డి చక్కర్లు

 

click me!
Last Updated Feb 16, 2019, 9:14 PM IST
click me!