
కుటుంబ తగాదాల పేరుతో కవి, గాయకుడు ఏపూరి సోమన్న కు బేడిలు వేయడం అధికార పార్టి దాస్తీ కానికి నిదర్శనమని తెలంగాణ విద్యావంతుల వేదిక జనగామ జిల్లా కన్వీనర్ కోడం కుమార్ విమర్శించారు.
సోమన్నను బేడీలేసి అరెస్టు చేసిన సమయం లో ఒక ఎమ్మెల్యే భార్య అక్కడ ఎందుకున్నరని ప్రశ్నించారు. .పోలీస్ స్టేషన్ లో రహాస్య వీడియోలు తీసి మీడియా కు లీక్ చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
లాంటి నీచ పనికి పాల్పడిన వారి మీద చర్యలు తీ సుకోవాలని డిమాండ్ చేశారు. కవులు, కళాకారులపై కుట్రలు నడుపుతన్న పాలకుల తీరుకు నిరసనగా కవులు, కళాకారులు తమ కలాలు,గళాలు విప్పాలని కోడం కుమార్ పిలుపునిచ్చారు.
మరిన్ని తాజా తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి