బ‌క్రీద్‌కు బ‌ల్దియా విస్తృత ఏర్పాట్లు

Published : Sep 01, 2017, 11:11 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
బ‌క్రీద్‌కు బ‌ల్దియా విస్తృత ఏర్పాట్లు

సారాంశం

బక్రీద్ ఉత్సవానికి భారీ ఏర్పాట్లు వ్యర్థాల తొలగింపు కోసం 464 వాహనాలు  ఉచితంగా ప్లాస్టిక్ సంచుల పంపిణీ

బ‌క్రీద్‌కు బ‌ల్దియా విస్తృత ఏర్పాట్లు చేసింది జిహెచ్ఎంసి. వ్య‌ర్థాల తొల‌గింపుకు ల‌క్ష‌న్న‌ర ప్లాస్టిక్ బ్యాగ్‌లను పంపిణీ చేస్తోంది. బ‌క్రీద్ పండుగ సంద‌ర్భంగా వ‌చ్చే జంతు సంబంధిత వ్య‌ర్థాల‌ను తొల‌గించడానికి 1,50,000 ప్లాస్టిక్ బ్యాగ్‌ల‌ను ఉచితంగా పంపిణీ చేయ‌డంతో పాటు వ్య‌ర్థాల‌ను వెంట‌వెంట‌నే తొల‌గించడానికి 464 అద‌న‌పు వాహ‌నాల‌ను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది.

న‌గ‌రంలో బ‌క్రీద్ పండుగ ప్ర‌ధానంగా జ‌రిగే ప్రాంతాల్లో ఈ వ్య‌ర్థాలను ప్లాస్టిక్ బ్యాగుల‌లో వేయ‌డానికి ప్ర‌త్యేకంగా వీటిని అందిస్తున్నామ‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌స‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి తెలిపారు. బ‌క్రీద్ సంద‌ర్భంగా ఏర్ప‌డే వ్య‌ర్థాల‌ను వెంట‌నే తొల‌గించేలా ప్ర‌త్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్న‌ట్టు, వీటి ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ప్ర‌త్యేక అధికారుల‌ను నియ‌మించామ‌ని తెలిపారు.

వ్య‌ర్థాల‌ను తొల‌గించిన వెంట‌నే రోడ్ల‌ను శుభ్ర‌ప‌ర‌చ‌డానికి త‌గు వాట‌ర్ ట్యాంక‌ర్ల‌ను ముందుగానే ఏర్పాటు చేసిన‌ట్టు పేర్కొన్నారు. కాగా జీహెచ్ఎంసీ ఆధ్వ‌ర్యంలో ప‌లు మ‌జీద్‌లు, ఈద్గాలు, పాత‌బ‌స్తీతో పాటు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌ను ఉచితంగా పంపిణీచేశామ‌ని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu