వీడిన మిస్టరీ .. పోలీసుల ముందు ప్రత్యక్షమైన బీజేపీ నేత తిరుపతి రెడ్డి, మైనంపల్లిపై సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jul 18, 2023, 07:23 PM IST
వీడిన మిస్టరీ .. పోలీసుల ముందు ప్రత్యక్షమైన బీజేపీ నేత తిరుపతి రెడ్డి, మైనంపల్లిపై సంచలన వ్యాఖ్యలు

సారాంశం

అదృశ్యమైన స్థిరాస్థి వ్యాపారి, జనగామ జిల్లాకు చెందిన తిరుపతి రెడ్డి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. పోలీసుల ఎదుట ఆయన కుటుంబంతో కలిసి ప్రత్యక్షమయ్యారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నుంచి తనకు ప్రాణహానీ వుందని ఆయన ఆరోపించారు.

అదృశ్యమైన స్థిరాస్థి వ్యాపారి, జనగామ జిల్లాకు చెందిన తిరుపతి రెడ్డి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. మంగళవారం డీసీపీ ఆఫీసులో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యక్షమయ్యారు. ఈ క్రమంలో తిరుపతి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిడ్నాప్ చేసి తనను చంపాలని చూశారని ఆయన పేర్కొన్నారు. దీంతో విజయవాడ పారిపోయి తలదాచుకున్నానని తిరుపతి రెడ్డి చెప్పారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నుంచి తనకు ప్రాణహానీ వుందని ఆయన ఆరోపించారు. తనను ఎంత బెదిరించినా.. తన స్థలం కబ్జా కానివ్వనని తిరుపతి రెడ్డి స్పష్టం చేశారు. 

కాగా.. తిరుపతి రెడ్డి గురువారం మధ్యాహ్నం తన కారులో అల్వాల్ లోని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తన ప్లాట్ ను పరిశీలించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం కరెంట్ బిల్లు తీసుకురావాలని డ్రైవర్ ను కోరాడని చెప్పారు. అయితే డ్రైవర్ ఆఫీసుకు తిరిగి వచ్చేసరికి తిరుపతి కనిపించలేదని, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయ్యిందని తెలిపారు.

ALso Read: జనగామ బీజేపీ నేత తిరుపతిరెడ్డి అదృశ్యం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుడిపై ఆరోపణలు చేస్తూ కుటుంబ సభ్యుల ఆందోళన

వెంటనే డ్రైవర్ తమకు ఫోన్ చేసి యజమాని ఇంటికి వచ్చాడా అని ఆరా తీశారని చెప్పారు. కానీ ఆయన ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందుతూ తాము అంతా అల్వాల్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నామని అన్నారు. కుషాయిగూడలోని నాగార్జున కాలనీలోని తన నివాసం నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తున్నానని చెప్పి తిరుపతి అక్కడి నుంచి బయలుదేరినట్లు బంధువు ఒకరు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. తిరుపతి ఆటో ఎక్కుతున్న దృశ్యాలు కనిపించడంతో ఇది కిడ్నాప్ కేసునా కాదా అనేది తెలియడం లేదని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఆటో ఘట్ కేసర్ వైపు వెళ్లిందని పోలీసులు తెలిపారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KTR Speech: కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తాం.. ఎదురు దెబ్బలు పట్టించుకోము | Asianet News Telugu
Hyderabad Police Commissioner VC Sajjanar Celebrate New Year at Charminar HYD | Asianet News Telugu