గోషామహల్ కు నందుకిషోర్, నాంపల్లికి ఆనంద్ కుమార్: పెండింగ్‌లో రెండు సీట్లను ప్రకటించిన బీఆర్ఎస్

Published : Nov 07, 2023, 04:45 PM ISTUpdated : Nov 07, 2023, 05:16 PM IST
గోషామహల్ కు నందుకిషోర్,  నాంపల్లికి  ఆనంద్ కుమార్: పెండింగ్‌లో రెండు సీట్లను ప్రకటించిన బీఆర్ఎస్

సారాంశం

పెండింగ్ లో ఉన్న రెండు స్థానాల్లో అభ్యర్ధులను బీఆర్ఎస్ ప్రకటించింది. దీంతో  రాష్ట్రంలోని  119 అసెంబ్లీ స్థానాలకు  బీఆర్ఎస్ తన  అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. 

హైదరాబాద్: గోషామహల్ , నాంపల్లి అసెంబ్లీ స్థానాల్లో  పోటీ చేసే అభ్యర్ధులను  మంగళవారంనాడు బీఆర్ఎస్ ప్రకటించింది.గోషామహల్  నుండి నందుకిషోర్ వ్యాష్ ను  బరిలోకి దింపింది బీఆర్ఎస్. నాంపల్లి నుండి సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ ను బీఆర్ఎస్ బరిలోకి దింపింది.ఈ ఏడాది ఆగస్టు మాసంలో  బీఆర్ఎస్  115 మందితో  అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. నాలుగు స్థానాలను పెండింగ్ లో ఉంచింది.

 జనగామ,నర్సాపూర్, గోషామహల్,  నాంపల్లి స్థానాల్లో  అభ్యర్ధులను పెండింగ్ లో పెట్టింది. నర్సాపూర్ లో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి టిక్కెట్టు కేటాయించింది.  జనగామలో  ఎమ్మెల్సీ  పల్లా రాజేశ్వర్ రెడ్డిని బరిలోకి దింపింది.  గోషామహల్, నాంపల్లి సీట్లలో బరిలోకి దింపే అభ్యర్థుల పేర్లను  బీఆర్ఎస్ పెండింగ్ లో పెట్టింది. ఇవాళ ఈ రెండు సీట్లలో బరిలోకి దిగే ఇద్దరి పేర్లను బీఆర్ఎస్ ప్రకటించింది.

నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి ఈ దఫా  బీఆర్ఎస్ టిక్కెట్టు ఇవ్వలేదు. మెదక్ ఎంపీ స్థానం నుండి మదన్ రెడ్డిని బరిలోకి దింపాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. గత మాసంలో  మదన్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని  ప్రగతి భవన్ కు రప్పించారు  కేసీఆర్. ఇద్దరితో చర్చించారు. మదన్ రెడ్డిని మెదక్ నుండి ఎంపీగా బరిలోకి దింపుతున్న విషయాన్ని ప్రకటించారు.మదన్ రెడ్డి  సమక్షంలో సునీతా లక్ష్మారెడ్డికి  బీ ఫామ్ అందించారు కేసీఆర్. 

ఇదిలా ఉంటే  ఆలంపూర్ అసెంబ్లీ స్థానంలో  అబ్రహం బదులుగా విజయుడికి టిక్కెట్టు కేటాయించాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తుందనే ప్రచారం కూడ సాగుతుంది. అబ్రహనికి బదులుగా  విజయుడికి  బీఆర్ఎస్ బీ ఫాం అందిస్తారని ప్రచారం సాగుతుంది.  ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి  సూచన మేరకు  అబ్రహం బదులుగా విజయుడిని మార్చాలనే  నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం సాగుతుంది.ఈ విషయమై బీఆర్ఎస్ అధికారికంగా  ప్రకటించాల్సి ఉంది.

also read:ఆ పార్టీదే మోసపు చరిత్ర: మంథని సభలో కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్

కాంగ్రెస్ పార్టీ ఇంకా  మూడు  స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది.  మరోవైపు  బీజేపీ  ఇంకా 19 స్థానాల్లో అభ్యర్థులను  ప్రకటించాల్సి ఉంది. జనసేనకు కేటాయించే  ఎనిమిది లేదా  తొమ్మిది స్థానాల్లో  అభ్యర్ధులను మినహాయించి మిగిలిన స్థానాల్లో అభ్యర్ధులను బీజేపీ ప్రకటించనుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Richest District : ఇండియాలో రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? ముంబై, ఢిల్లీ కానే కాదు !
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో జల్లులు