Telangana Elections: తెలంగాణ ఎన్నికల పోరులో తలపడటానికి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కూడా సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సాగుతోన్న ప్రతిపక్ష బీజేపీ జత కట్టి.. ఎన్నికల సంగ్రామంలో దిగాలని భావిస్తోంది.
Telangana Elections: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. పార్టీలన్నీ వ్యూహాలకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ప్రధాన పార్టీలతోపాటు తెలంగాణ ఎన్నికల పోరులో తలపడటానికి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కూడా సిద్ధమవుతోంది. అయితే.. తెలంగాణలో జనసేనకు ఏపాటి బలముందో తెలియదు. గానీ, జనసేన మాత్రం పోటీకు ఆసక్తి చూపిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సాగుతోన్న ప్రతిపక్ష బీజేపీ జత కట్టి.. ఎన్నికల సంగ్రామంలో దిగాలని భావిస్తోంది. కాగా.. రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖరారైనట్టు సమాచారం. కానీ, ఈ పొత్తుపై అధికార ప్రకటన ఇంకా వెలువడలేదు.
తెలంగాణ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వీరి పొత్తు ఎవరికీ ప్రయోజనం చేకూర్చుతుందో? ఎవరికి ప్రితికూలంగా మారుతోందనే అనే విషయం పక్కన బెడితే.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేయనుందని తెలుస్తోంది. ఇంతవరకూ ఏ పార్టీ ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయకపోయినా.. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిందని, సీట్ల లెక్కలు కూడా తేలాయనే ప్రచారం సాగుతోంది.
బీజేపీ-జనసేన మధ్య పొత్తులో భాగంగా జనసేనకు 7 నుండి 12 స్థానాలు కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఉమ్మడి ఖమ్మంలో 3 స్థానాలు, ఉమ్మడి నల్లగొండ రెండు. వరంగల్, కరీంనగర్లో ఒక్కొక్కటి చొప్పున సీట్లు కేటాయించినట్టు తెలుస్తోంది. బీజేపీ రెండవ జాబితాలో జనసేనకు కూడా కేటాయించే స్థానాలు ఉండే అవకాశముంది.