మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాస.. చివరకు జానారెడ్డి జోక్యం చేసుకోవడంతో..

By Sumanth KanukulaFirst Published Jan 17, 2022, 4:51 PM IST
Highlights

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. పార్టీ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే నల్గొండ జిల్లా మిర్యాలగూడ‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో రసాభాస చోటుచేసుకుంది. 

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. పార్టీ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే నల్గొండ జిల్లా మిర్యాలగూడ‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో రసాభాస చోటుచేసుకుంది. ఫ్లెక్సీలో ఫొటో విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. తమ నేత ఫొటో  పెట్టలేదంటూ ఓ నేత వర్గీయులు గొడవకు దిగారు. తమ నేత ఫొటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఉన్న సీనియర్ నాయకుల ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆ కార్యక్రమంలో గందరగోళం చోటుచేసుకుంది. 

చివరకు సినీయర్ నేత కుందూరు జానారెడ్డి (Kunduru Jana Reddy) జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన  జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు అంతా ఒకటిగా ఉండి క్రమశిక్షణ పాటించాలని కోరారు. ఏదైనా సమస్య ఉంటే తనతో చర్చించాలని అన్నారు. ఈ విధంగా చేస్తే కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రసక్తే లేదన్నారు. కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయాలని ఆశిస్తున్నట్టుగా చెప్పారు. 

కాంగ్రెస్ ప్రతిష్టను కాపాడే బాధ్యత మిర్యాలగూడ నుంచే ప్రారంభమవ్వాలని కోరారు. ఇక్కడి ఎమ్మెల్యే, నల్గొండ మాజీ ఎంపీ పార్టీ మారి కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీశారని విమర్శించారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ ను గెలిపించేందుకు, పార్టీకి పునర్ వైభవాన్ని అందించేందుకు సూచనలు, సలహాలు ఇస్తానని జానారెడ్డి తెలిపారు.


 

click me!