అక్రమంగా మా భూముల్లో విచారణ: హైకోర్టులో జమున హేచరీస్ పిటిషన్

Published : May 04, 2021, 10:31 AM ISTUpdated : May 04, 2021, 10:37 AM IST
అక్రమంగా మా భూముల్లో విచారణ: హైకోర్టులో జమున హేచరీస్ పిటిషన్

సారాంశం

తమ భూముల్లోకి అక్రమంగా ప్రవేశించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జమున హేచరీస్ సంస్థ మంగళవారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

హైదరాబాద్: తమ భూముల్లోకి అక్రమంగా ప్రవేశించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జమున హేచరీస్ సంస్థ మంగళవారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జమున హేచరీస్ సంస్థ మాసాయిపేట, హకీంపేట  గ్రామాల్లో అసైన్డ్ భూములను అక్రమించారని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రాథమిక రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించారు. ఈ రిపోర్టు ఆధారంగా  ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేస్తూ  సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. అచ్చంపేటలోని తమ భూముల్లోకి అక్రమంగా ప్రవేశించారని ఈ పిటిషన్ లో జమున హేచరీస్ ఆరోపించింది. 

 

కనీసం తమకు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా హేచరీస్ లోకి ప్రవేశించారని ఆ పిటిషన్ లో  ఆ సంస్థ పేర్కొంది. తమ అనుమతి లేకుండా విచారణ నిర్వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ కోరింది.మాసాయిపేట, హకీంపేటతో పాటు దేవరయంజాల్ గ్రామాల్లో  ఈటల రాజేందర్ తో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున  భూములను ఆక్రమించుకొన్నారనే  ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణ నిర్వహిస్తోంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!