యువకుడి ప్రేమ... స్నేహితులే చంపడానికి ప్లాన్.. చివరకు..

Published : May 04, 2021, 09:43 AM IST
యువకుడి ప్రేమ... స్నేహితులే చంపడానికి ప్లాన్.. చివరకు..

సారాంశం

ఈ విషయమై అతని మిత్రులతో వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. అదే గ్రామానికి చెందిన మధు, మరో ఇద్దరు యువకులకు మద్యం తాగేందుకు అంకమ్మరావును ఆదివారం రాత్రి సమీపంలోని పొలాల్లోకి తీసుకువెళ్లారు. 

ఓ యువకుడి ప్రేమ... ఇద్దరు స్నేహితుల మధ్య వివాదానికి దారి తీసింది. ఆ వివాదం ఎక్కడకు దారి తీసిందంటే.. ఏకంగా.. ప్రాణాల మీదకు తెచ్చింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకునే పరిస్థితికి దారి తీసింది. ఈ సంఘటన మద్దిపాడు మండలంలోని నేలటూరులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నేలటూరుకు చెందిన యరజాని అంకమ్మరావు(20) బేల్దారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతను గత కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయమై అతని మిత్రులతో వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. అదే గ్రామానికి చెందిన మధు, మరో ఇద్దరు యువకులకు మద్యం తాగేందుకు అంకమ్మరావును ఆదివారం రాత్రి సమీపంలోని పొలాల్లోకి తీసుకువెళ్లారు. 

అక్కడ కూడా ఈ ప్రేమ విషయంలోనే వివాదం చోటుచేసుకుంది. మిత్రులంతా కలిసి అంకమ్మరావుపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఆ వేడి తట్టుకోలేక అంకమ్మరావు రోడ్డుపైకి పరుగులు తీశాడు. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్ల పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్