హైద్రాబాద్‌లో 8 సింహాలకు కోవిడ్ లక్షణాలు: సీసీఎంబీకి శాంపిల్స్

By narsimha lodeFirst Published May 4, 2021, 9:57 AM IST
Highlights

హైద్రాబాద్‌లోని జూపార్క్‌లోని 8 సింహాలకు కోవిడ్ లక్షణాలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ సింహాల నుండి శాంపిళ్లను సేకరించి సీసీఎంబీకి పంపారు అధికారులు.

హైదరాబాద్: హైద్రాబాద్‌లోని జూపార్క్‌లోని 8 సింహాలకు కోవిడ్ లక్షణాలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ సింహాల నుండి శాంపిళ్లను సేకరించి సీసీఎంబీకి పంపారు అధికారులు.కరోనా వైరస్ కారణంగా  అమెరికాతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడ కరోనా కారణంగా జంతువులు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ తో ప్రజలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా సెకండ్ వేవ్ ఇండియాలో పెద్ద ఎత్తున కేసులు రికార్డు అవుతున్నాయి. 

హైద్రాబాద్ లోని నెహ్రు జూలాజికల్ పార్క్ లో ఉన్న సింహాలు కొన్ని రోజులు అనారోగ్యంగా ఉన్నాయి. దీంతో వీటి శాంపిళ్లను  జూపార్క్ అధికారులు సీసీఎంబీకి తరలించారు. ఇవాళ రిపోర్టు వచ్చే అవకాశం ఉంది. సీసీఎంబీ రిపోర్టు ఆధారంగా  జంతువులకు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకొనే అవకాశం లేకపోలేదు. 

దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. లాక్ డౌన్ విషయంలో నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అప్పగించింది. మరో వైపు వ్యాాక్సినేషన్ ను వేగవంతం చేయాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు సూచించింది.
 

click me!