బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ... మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా, కాంగ్రెస్ లో చేరి పోటీకి సై..

By Arun Kumar P  |  First Published Oct 31, 2023, 12:04 PM IST

తెలంగాణలో అధికార బిఆర్ఎస్ మరో షాక్ తగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కీలక నేత పార్టీకి రాజీనామా చేసారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. 


ఖమ్మం : అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బిఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కీలక నాయకులు బిఆర్ఎస్ ను వీడారు. ఇలా నాయకుల జంపింగ్ తో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ బాగా దెబ్బతిందనే చెప్పాలి. ఈ క్రమంలో తాజాగా ఈ జిల్లాకే చెందిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. 

బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం టికెట్ దక్కుతుందని ఆశించిన వెంకట్రావుకు నిరాశ తప్పలేదు. ఏడెనిమిది మందిని మినహా మిగతా అందరు సిట్టింగ్ లకు అధినేత కేసీఆర్ మరో అవకాశం ఇచ్చారు. ఇలి కొత్తగూడెం టికెట్ కూడా వనమా వెంకటేశ్వర రావుకు దక్కింది. దీంతో జలగం వెంకట్రావు తీవ్ర అసంతృప్తికి గురయి పార్టీకి రాజీనామా చేసాడు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించిన వెంకట్రావు బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. 

Latest Videos

undefined

కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం టికెట్ ఇచ్చేందుకు సిద్దంగా వుండటంతో ఆ పార్టీలో చేరేందుకు జలగం వెంకట్రావు సిద్దమయ్యారు. ఇప్పటికే టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నాయకులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి వెంకట్రావు డిల్లీకి చేరుకున్నారు.  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో జలగం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. 

Read More  మంత్రి గంగుల కమలాకర్ ప్రచార వాహనంపై చెప్పు దాడి ...

ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వంటి కీలక నాయకులు బిఆర్ఎస్ ను వీడారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే జలగం కూడా పార్టీని వీడటం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. సహజంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ బలం తక్కువగా వుంది... ఈ విషయం గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను భట్టి అర్థమవుతుంది. ఇలాంటిచోట కీలక నాయకులు పార్టీని వీడుతుండటం అధికార పార్టీని కలవర పెడుతోంది. 

ఉమ్మడి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటితో ప్రారంభమైన ఈ జంపింగ్స్ ప్రస్తుతం జలగం వెంకట్రావు వరకు కొనసాగాయి. మరికొందరు నాయకులు సైతం బిఆర్ఎస్ వీడే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఏదేమైనా అసలే బలహీనంగా వున్న జిల్లాలో నాయకులు పార్టీని వీడుతుండటం బిఆర్ఎస్ విజయావకాశాలను దెబ్బతీయనుంది. 

ఇటీవల కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి బిఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ గూటికి తీసుకురావడంతో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ ను చావుదెబ్బ కొడతానని... ఆ పార్టీ నుండి పోటీచేసే ఏ ఒక్కరినీ గెలవనివ్వబోనని ఛాలెంజ్ చేసారు. ఎమ్మెల్యేగా గెలవడం కాదు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనంటూ బిఆర్ఎస్ ను హెచ్చరించారు పొంగులేటి. అన్నట్లుగానే బిఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడంతో ఆయన సక్సెస్ అవుతున్నారు. 
 

click me!