Hyderabad: రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని గురువారం నుంచి పున:ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నిర్ణయించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. బీఆర్ఎస్ అంటే భారత 'రైతు' సమితి అని మరోసారి రుజువైందని అన్నారు.
Telangana Minister KT Rama Rao (KTR): జై కిసాన్ అనేది మాకు కేవలం ఓ నినాదం కాదు.. మా ప్రభుత్వ విధానమని తెలంగాణ ఐటీ మంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ.రామారావు (కేటీఆర్) అన్నారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని గురువారం నుంచి పున:ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నిర్ణయించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అని మరోసారి రుజువైందని అన్నారు. ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను కొనియాడారు.
ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. "బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అని మరోసారి రుజువైంది. జై కిసాన్ అనేది మాకు కేవలం ఓ నినాదం కాదు.. మా ప్రభుత్వ విధానం అని మరోసారి తేలిపోయింది. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా.. బీజేపీ సర్కారు అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులు సృష్టించినా.. రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం.. ముఖ్యమంత్రి కేసిఆర్ సంకల్ప బలానికి నిలువెత్తు నిదర్శనమని" పేర్కొన్నారు. అలాగే, తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. "రైతు సంక్షేమంలో తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం.. రైతుకు రక్షణ కవచంగా అమలుచేసిన ప్రతి పథకం వ్యవసాయ రంగ చరిత్రపై చెరగని సంతకం. దేశవ్యాప్తంగా వ్యవసాయం అంటే సంక్షోభం, కానీ.. ఒక్క తెలంగాణలోనే వ్యవసాయం అంటే సంతోషం.. యావత్ తెలంగాణ రైతాంగం ముక్తకంఠంతో చేస్తున్న నినాదమిదని" పేర్కొన్నారు.
కాగా, తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్ననేపథ్యంలో, రాష్ట్రంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పున: ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్ లో బుధవారం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని గురువారం నుంచి పున:ప్రారంభించాలని నిర్ణయించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదలచేయకుండా కేంద్రం, తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు తదితర కారణాల వల్ల ఆర్థికలోటుతో ఇన్నాల్లు కొంత ఆలస్యమైందని సీఎం తెలిపారు.
అలాగే, ‘‘ఇచ్చిన మాట ప్రకారం, రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగించినం. కరోనా వంటి అనుకోని ఉపద్రవాల వల్ల కేంద్రం ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం నిధుల్లో ఏకపక్షంగా కోత విధించడం, తెలంగాణకు విడుదల చేయాల్సిన నిధుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల రైతు రుణమాఫీ కార్యక్రమంలో కొంతకాలం పాటు జాప్యం జరిగింది. రైతులకు అందిచాల్సిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో నిరాఘాటంగా కొనసాగిస్తూనే వస్తున్నది. మేము ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఆరునూరయినా రైతుల సంక్షేమాన్ని వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదు. పైగా వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాం. తద్వారా రైతు సాధికారత సాధించే వరకు వారిని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తేలేదు’’ అని సీఎం స్పష్టం చేశారు.