నారదాసుకు ఈటెల సెగ.. సమావేశంలో మిన్నంటిన ‘జై ఈటెల’ నినాదాలు...

Published : May 29, 2021, 03:58 PM IST
నారదాసుకు ఈటెల సెగ.. సమావేశంలో మిన్నంటిన ‘జై ఈటెల’ నినాదాలు...

సారాంశం

కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం కోర్కల్ గ్రామంలోని చేనేత సహకార సంఘం భవనంలో ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ దాసు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. 

కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం కోర్కల్ గ్రామంలోని చేనేత సహకార సంఘం భవనంలో ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ దాసు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. 

అయితే ఎమ్మెల్సీ నారాదాసు ఏర్పాటు చేసిన ఈ మీటింగులో ఈటెల నినాదాలు హోరెత్తాయి. కార్యకర్తలు జై ఈటెల జైజై ఈటెల నినాదాలతో హోరెత్తించారు. 

దీంతో షాక్ అయిన మండల స్థాయి టీఆరెఎస్ నాయకులు.. వారికి నచ్చచెబుతూ మాట్లాడుతూ వ్యక్తులు ముఖ్యం కాదు మనకు పార్టీ ముఖ్యం అని వాఖ్యనించారు. 

దీంతో ఈటెల వర్గీయుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. టీఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ నిన్నటి వరకు ఈటెల వెంట ఉండి ఇప్పుడు ఈటెల కు వ్యతిరేకంగా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. 

టీఆర్ఎస్, ఈటెల వర్గీయుల మధ్య  ఘర్షణ వాతావరణం తలెత్తడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. వారికి నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఈటెల వర్గీయుల జై ఈటెల అంటూ మరింత స్వరం పెంచారు. 

ఇక ఈ గొడవ ఇలా ముగిసేలా లేదని, ఈటెల వర్గీయులను పోలీసులు బయటకు తీసుకు వెళ్లారు. దీంతో గొడవ సర్ధు మనిగింది.
 
PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?