రాహుల్ ప్రధాని అయితేనే.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి : జగ్గారెడ్డి

By SumaBala Bukka  |  First Published Feb 26, 2024, 3:26 PM IST

కిషన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. దేవుడి గురించి తప్ప సమస్యల గురించి బీజేపీ నేతలు మాట్లాడడం లేదన్నారు. 


హైదరాబాద్ : కాంగ్రెస్ నేత, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేస్తేనే.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగారని.. ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నారన్నారు. ఇప్పుడు న్యాయ యాత్ర కొనసాగుతోందన్నారు. 

రాహుల్ గాంధీ మతాన్ని రాజకీయం ఎప్పుడూ చేయలేదన్నారు. బీజేపీ పుట్టిన తరువాతే ప్రజలంతా దేవుళ్లను మొక్కుతున్నట్లుగా క్రియేట్ చేస్తూ..రాజకీయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీది దిగజారుడు రాజకీయం అన్నారు. దేవుడి గుడిని కూడా రాజకీయానికి వాడుకోవాలని చూస్తోందని తెలిపారు. బీజేపీది ఎమోషన్ పాలిటిక్స్ అని మండిపడ్డారు. 

Latest Videos

మీది మొత్తం 24 అయ్యింది, 3 ఎంపీలు ఎక్స్ ట్రా... పవన్ పై పేలుతున్న మీమ్స్...

బీజేపీ నేతలు దేవుడి గురించి మాట్లాడతారు. కానీ పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల గురించి మాట్లాడరు. ధరల పెరుగుదలపై మాట్లాడే ధైర్యం కిషన్ రెడ్డి లేదు అన్నారు జగ్గారెడ్డి. బీజేపీ ప్రజలను తన మాటలతో మోసం చేస్తుందన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని కోరారు. 

కాంగ్రెస్ 17 ఎంపీ సీట్లు గెలుచుకోవాలన్నారు. హైదరాబాద్ ఎంపీ సీటు కూడా కాంగ్రెస్ నే గెలిచించాలని, మైనార్టీ సోదరులకు విజ్ఞప్తి చేశారు. మంచి రోజులు వస్తాయని.. రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని అన్నారు. బీజేపీ యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యతను విస్మరించిందని మండిపడ్డారు.

click me!