ప్రధానమంత్రి ఆదివారం రోజును గుజరాత్‌లో స్కూబా డైవింగ్ చేశారు. పురాతన.. నీట మునిగి ద్వారకా నగరాన్ని సందర్శించి వచ్చారు. కాంగ్రెస్ కూటమిలో జోష్ మొదలైంది. రాహుల్ గాంధీ యత్రలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు.
ప్రధాని మోడీ:
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివరం గుజరాత్ సముద్రంలో స్కూబా డైవింగ్ చేశారు. స్కూబా డైవింగ్ ద్వారా సముద్రగర్భంలోకి వెళ్లి ద్వారకాను సందర్శించి వచ్చారు. ద్వారకాలోని కృష్ణుడు ఆలయానికి నెమలి ఈకలు తీసుకెళ్లి సమర్పించారు. శ్రీకృష్ణుడికి పూజలు చేశారు. ద్వారకాను తాకినప్పుడు అలనాటి ప్రాచీన వైభవాన్ని చూసి తరించినట్టుగా, దివ్యత్వానని అనుభూతి చెందారని ప్రధాని మోడీ చెప్పారు. గుజరాత్‌లో దేశంలోనే అతిపెద్ద పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతను ప్రధాని ప్రారంభించారు.
కాంగ్రెస్ ముందడుగు:
నితీశ్ కుమార్ కూటమి ఫిరాయించడంతో ఇండియా అలయెన్స్ కథ కంచికి చేరినట్టేనని చాలా మంది భావించారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌లు ఇద్దరూ కాంగ్రెస్ కూటమిని దాదాపుగా తృణీకరించినట్టుగానే నడుచుకున్నారు. యూపీలో కూడా భారత్ జోడో న్యాయ్ యాత్రకు ఓ అల్టిమేటం పెట్టి కొత్త సందేహాలను లేవనెత్తిన సమాజ్‌వాదీ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి అడుగు వేసింది. సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌లతో పొత్తు కుదిరిందని వివరించారు. మమతా బెనర్జీ కూడా ఐదు సీట్లను కాంగ్రెస్‌కు ఇవ్వడానికి అంగీకరించినట్టు సమాచారం.
కిషన్ రెడ్డి, బండి, ధర్మపురిలకు టికెట్ కన్ఫామ్?
రాష్ట్రంలో బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు ఉండే ప్రసక్తేలేదని కమలం అధిష్టానం ఇక్కడి నాయకులకు సంకేతాలు ఇచ్చింది. శనివారం రాత్రి బీజేపీ అధిష్టానం ఓ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో అభ్యర్థిత్వాలపై చర్చంచారు. ఈ తొలి జాబితాను రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా చర్చించి ఆ తర్వాత ప్రకటిస్తారు. కాగా, సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు దాదాపు కన్ఫామ్ల అయ్యాయని తెలిసింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నది. కాగా, సోయంబాపురావును పెండింగ్‌లో పెట్టారు.
Also Read: LS Polls: కాంగ్రెస్, బీజేపీ హుషారు.. ఉలుకులేని బీఆర్ఎస్!
తెలంగాణలో మోడీ వేవ్ లేదు:
తెలంగాణ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ లోక్ సభ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మోడీ వేవ్ లేదని అన్నారు. ‘పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీని నెరవేర్చని ప్రధాని మోడీ గురించి ఎందుకు ఆలోచించాలి?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పేరు ప్రకటించి వెళ్లితే.. 30 సీట్లు కూడా గెలిచేది కాదు అని స్పష్టం చేశారు.
సీబీఐకి కవిత లేఖ:
సీఆర్పీసీ సెక్షన్ 41 కింద తనకు జారీ చేసిన నోటీసులను రద్దు కానీ, ఉపసంహరణ కానీ చేయాలని ఆమె లేఖలో కోరారు. సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరయ్యేందుకు అందుబాటులో వుంటానని కవిత వెల్లడించారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు వున్నందున ఈ నెల 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని ఆమె పేర్కొన్నారు. తనకు సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని కవిత పేర్కొన్నారు.