మాకు పాస్‌పోర్టులే లేవు: జగ్గారెడ్డి భార్య నిర్మల

By pratap reddyFirst Published 11, Sep 2018, 6:54 AM IST
Highlights

తనకూ తన పిల్లలకు పాస్‌పోర్టులే లేవని, తామెప్పుడూ అమెరికా వెళ్లలేదని అరెస్టయిన కాంగ్రెసు నేత తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి భార్య నిర్మల మీడియాతో అన్నారు. 

హైదరాబాద్:  తనకూ తన పిల్లలకు పాస్‌పోర్టులే లేవని, తామెప్పుడూ అమెరికా వెళ్లలేదని అరెస్టయిన కాంగ్రెసు నేత తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి భార్య నిర్మల మీడియాతో అన్నారు. తన భర్తను అరెస్టు చేసిన విషయం టీవీల ద్వారానే తనకు తెలిసిందని, పోలీసులు తనకు ఎలాంటి సమాచారం అందించలేదని ఆమె తెలిపారు.

 ఇది ప్రజాస్వామ్యమేనా, ఇదేం ప్రభుత్వమని ఆమె ప్రశ్నించారు. తన భర్తను ఎక్కడికో తీసుకెళ్లారని, భార్యతో మాట్లాడించాలనే ధర్మాన్ని కూడా పాటించలేదని ఆమె అన్నారు. ఆయన ఫోన్లు ఆన్‌లో లేవని అన్నారు. పోలీసులే తీసుకెళ్లారా, ఇంకెవరైనా తీసుకెళ్లారా అనేది తెలియడం లేదని అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. 

తన భర్త జగ్గారెడ్డి అమెరికా వెళ్లిన విషయం కూడా తనకు తెలియదని చెప్పారు. తన భర్త ప్రాణానికి ముప్పు ఉంని ఆమె అన్నారు. దయచేసి ఆయనతో ఫోన్లో మాట్లాడించాలని ఆెమ పోలీసులను కోరారు.

ఈ వార్తలు చదవండి

మనుషుల అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి అరెస్టు

తప్పించుకునేందుకు జగ్గారెడ్డి ఎత్తు: సంగారెడ్డి బంద్ కు పిలుపు

Last Updated 19, Sep 2018, 9:22 AM IST