నేను తప్ప మా పార్టీలో అందరూ స్టార్లే: జగ్గారెడ్డి

Published : Jan 20, 2019, 01:12 PM IST
నేను తప్ప మా పార్టీలో అందరూ స్టార్లే: జగ్గారెడ్డి

సారాంశం

మా పార్టీలో నేను తప్ప అందరూ కూడ  స్టార్లేనని  సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి  చెప్పారు. రాహుల్ గాంధీ నిర్ణయంతో పాటు  లాబీయింగ్‌ కూడ మల్లు భట్టి విక్రమార్కకు సీఎల్పీ పదవి వచ్చిందని  ఆయన అభిప్రాయపడ్డారు.


హైదరాబాద్:  మా పార్టీలో నేను తప్ప అందరూ కూడ  స్టార్లేనని  సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి  చెప్పారు. రాహుల్ గాంధీ నిర్ణయంతో పాటు  లాబీయింగ్‌ కూడ మల్లు భట్టి విక్రమార్కకు సీఎల్పీ పదవి వచ్చిందని  ఆయన అభిప్రాయపడ్డారు.

ఎర్రవెల్లిలో  కేసీఆర్ నిర్వహించే చండీ యాగానికి నన్ను  పిలిచేంత ప్రోటోకాల్ తనకు లేదని జగ్గారెడ్డి తెలిపారు.  సీఎం దగ్గర సీఎల్పీ నేతకు ఉన్న ప్రాధాన్యత పీసీసీ చీఫ్‌కు ఉండకపోవచ్చని ఆయన చెప్పారు.  వచ్చే ఎన్నికల వరకు ఉత్తమ్‌ పీసీసీ చీఫ్‌గా కొనసాగాలని చెప్పారు.

ఎన్నికల ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి  సీఎం కావాలని సర్వే సత్యనారాయణ  ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  అయితే  ఏమైందో కానీ ఉత్తమ్ మీద సర్వే సత్యనారాయణ వ్యక్తిగత విమర్శలు చేశారని చెప్పారు. 

కేసీఆర్ సీఎం అయ్యాక సామాజిక కోణం పనిచేయడం లేదన్నారు. రాహుల్‌ గాంధీ మల్లు భట్టి విక్రమార్కకు  మంచి అవకాశం కల్పించారని చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్