రేపటి నుండి కేసీఆర్ మహారుద్ర సహిత సహస్ర చండీయాగం

Published : Jan 20, 2019, 12:20 PM IST
రేపటి నుండి కేసీఆర్ మహారుద్ర సహిత సహస్ర చండీయాగం

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్  మరోసారి తన ఫామ్‌హౌజ్‌లో  యాగాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 21వ తేదీ నుండి యాగాన్ని ప్రారంభించనున్నారు.ఈ యాగానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడ కేసీఆర్ ఆహ్వానాన్ని పంపారు.

హైదరాబాద్:  తెలంగాణ సీఎం కేసీఆర్  మరోసారి తన ఫామ్‌హౌజ్‌లో  యాగాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 21వ తేదీ నుండి యాగాన్ని ప్రారంభించనున్నారు.ఈ యాగానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడ కేసీఆర్ ఆహ్వానాన్ని పంపారు.

మహారుద్ర సహిత సహస్ర చండీయాగాన్ని కేసీఆర్  రేపు తన ఫామ్ హౌజ్ లో  ప్రారంభించనున్నారు. విశాఖ శారద పీఠానికి చెందిన రుత్వికులు ఈ యాగాన్ని  నిర్వహించనున్నారు.

ఇవాళ అసెంబ్లీ ముగిసిన వెంటనే కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు చేరుకోనున్నారు.  సుమారు 200 రుత్వికులు ఈ యాగాన్ని నిర్వహిస్తారు.  రేపు ఉదయం 11 గంటలకు యాగం ప్రారంభం కానుంది.

ఈ యాగం కోసం మూడు యాగ శాలలను 27 హోమ గుండాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 25వ తేదీ వరకు ఈ యాగం నిర్వహించనున్నారు.ఫామ్‌హౌజ్‌లో దక్షిణ ద్వారానికి అనుకొని యాగశాలను ఏర్పాటు చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్