గత ఏడేళ్లలో 7,000 మంది రైతులు ఆత్మహత్యలతో చనిపోయారని, చాలా మంది ఉపాధి కోల్పోయారని, నోటిఫికేషన్ ఇవ్వాల్సిన 1.90 లక్షల ఉద్యోగాలు ఎప్పుడూ జరగలేదని ఆమె చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లో తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని సవాల్ చేస్తూ.. ఆమె ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 4వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినట్లుగానే.. ఆయన బాటలోనే ఆమె కూడా పాదయాత్ర ప్రారంభించడం గమనార్హం. 2003 పాదయాత్ర తర్వాత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆమె కూడా అదేవిధంగా ముఖ్యమంత్రి సీటుపై కన్నేశారు. ఈ క్రమంలోనే పాదయాత్ర ప్రారంభించారు.
తన తండ్రి జయంతి రోజైన జూలై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రారంభించిన షర్మిల, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల కేవలం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుటుంబమే లబ్ది పొందిందని ఆరోపించారు. గత ఏడేళ్లలో 7,000 మంది రైతులు ఆత్మహత్యలతో చనిపోయారని, చాలా మంది ఉపాధి కోల్పోయారని, నోటిఫికేషన్ ఇవ్వాల్సిన 1.90 లక్షల ఉద్యోగాలు ఎప్పుడూ జరగలేదని ఆమె చెప్పారు.
undefined
Also Read: షర్మిల పాదయాత్ర ప్రారంభం ... నా అభిమానులకు బీపీ వస్తుందంటున్న సీఎం జగన్
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల సోదరుడు జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్నప్పుడు 2013 లో 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆ తర్వాత.. జగన్ కూడా పాదయాత్ర చేసి.. సీఎంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జగన్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పటికీ.. షర్మిల మాత్రం అక్కడ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
ఇప్పుడు తెలంగాణలో సత్తా చాటాలని పార్టీ ప్రారంభించారు. అక్టోబర్ 20వ తేదీన ఆమె తన పాదయాత్రను ప్రారంభించారు. తన తండ్రి మాదిరిగానే.. తనను కూడా ఆదరించాలంటూ ఆమె ప్రజలకు కోరడం విశేషం.
కాగా...షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర శుక్రవారం రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ నియోజకవర్గంలో సాగింది. వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం నాటికి నాలుగు రోజులకు చేరుకుంది. నేడు పోషెట్టి గుడా క్యాంప్ నుంచి ఉదయం 9.30కి పాదయాత్ర మొదలు పెట్టనుంది. రాజేంద్ర నగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లోని రషీద్ గుడా, గొల్లపల్లి, హమిదుల్ల నగర్, చిన గోల్కొండ, పేద గోల్కొండ, బహదూర్ గుడాలో పాదయాత్ర కొనసాగనుంది. అనంతరం శంషాబాద్ లో బస్టాండ్ వద్ద జరిగే సభలో ప్రసంగించనుంది