
‘‘సీఎం కేసీఆర్ నిప్పులాంటోడు.. ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యుత్ ప్రాజెక్టులను ఆదర్శంగా కడుతున్నం. నిర్మాణ బాధ్యతలన్నీ ప్రభుత్వ రంగానికే అప్పగించి, నిజాయతీని చాటుకుంటున్నం’’ అని విద్యుత శాఖ మంత్రి జి.జగదీశరెడ్డి అన్నారు. టీట్రాన్సకో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎనపీడీసీఎల్ సీఎండీ ఎ.గోపాలరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ పని తీరును ఇతర రాష్ట్రాలు, కేంద్రం మెచ్చుకుంటూ తెలంగాణలో రాజకీయ అవినీతి లేదని కొనియాడుతుంటే విపక్షాలు మాత్రం అనవసర విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
కొందరు తెలంగాణ నేతలు పక్క రాష్ట్రానికి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.కొత్తగూడెంలో 800 మెగావాట్ల ప్రాజెక్టును రూ.3810 కోట్లతో కడుతున్నామని, ఏపీలో అదే సామర్థ్యమున్న ఎన్టీపీసీ ప్రాజెక్టును రూ.4606 కోట్లతో కడుతున్నారని గుర్తు చేశారు. దీన్ని బట్టి అవినీతి ఎక్కడుందో, తక్కువ వ్యయంతో ప్రాజెక్టుల నిర్మాణం ఎక్కడ జరుగుతోందో తెలుస్తోందన్నారు.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 59.83 కరెంట్ ఇవ్వాల్సి ఉండగా కృష్ణపట్నం-హిందూజా ఒప్పందాన్ని ఏపీ రద్దు చేసి కరెంట్ రాకుండా చేసిందని ఆరోపించారు. తెలంగాణకు కరెంట్ ఇచ్చేందుకు ముందుకొచ్చిన ప్రైవేట్ విద్యుత సంస్థలను అడ్డుకునే ప్రయత్నాలూ చేసిందన్నారు. నిబంధనల ప్రకారం యూనిట్‌కు రూ.3.97కు ఇవ్వాల్సిన ఏపీ రూ.5.35 కోట్ చేసిందని, ప్రైవేట్ విద్యుత సంస్థలు రూ.4.63కు అందించేందుకు ముందుకు రావడంతో మాట మార్చిందని గుర్తు చేశారు.
దేశంలో 36 చోట్ల విద్యుత ప్రాజెక్టుల నిర్మాణం సబ్ క్రిటికల్ టెక్నాలజీతోనే జరుగుతోందని, భద్రాద్రి ప్రాజెక్టుకూ అదే సాంకేతికతను ప్రతిపాదించామని, యాదాద్రి, భద్రాద్రికి త్వరలో అనుమతులొచ్చే అవకాశం ఉందన్నారు. పెద్ద నోట్ల రద్దుపై స్పందిస్తూ ‘‘ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు ఇబ్బంది కలగరాదు. దీనిపై సీఎం రోజూ చర్చిస్తున్నారు. సరైన సమయంలో సీఎం స్పందిస్తారు’’ అని జగదీశ్‌రెడ్డి అన్నారు.