Hyderabad Rains : ‘తాడు నా ప్రాణం కాపాడింది..’ బైక్ తో పాటు మ్యాన్ హోల్ లో పడి సురక్షితంగా బయటపడిన జగదీష్...

By AN TeluguFirst Published Oct 9, 2021, 12:08 PM IST
Highlights

బైక్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి భారీ వర్షానికి రోడ్డు పై ఉన్న కల్వర్టు నాలాలో పడి సురక్షితంగా బయటపడిన ఘటన నిన్న వనస్థలిపురం పరిధిలో జరిగింది. 

హైదరాబాద్ : ‘ఆటో నగర్ నుంచి కర్మాన్ ఘాట్ కి వెళుతుండగా నాలాలో పడిపోయాను. నీళ్లు ఎక్కువగా ఉండడంతో బ్రేక్ కొట్టాను. రహదారి ఎడ్జ్ లో బైక్ స్కిడ్ అయింది. బైక్ తో సహా మ్యాన్ హోల్ లో కొద్దిదూరం కొట్టుకుపోయారు.  నీళ్లు ఎక్కువగా ఉండడంతో ఎక్కడ ఉన్నానో అర్థం కాలేదు. చేతికి తాడు లాంటిది తగలడంతో పట్టుకుని బయటికి వచ్చా, చేతికి, వీపు భాగంలో గాయాలయ్యాయి’ అని నిన్న రాత్రి సురక్షితంగా బయటపడిన జగదీష్ చెబుతున్న మాటలివి.

బైక్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి భారీ వర్షానికి రోడ్డు పై ఉన్న కల్వర్టు నాలాలో పడి సురక్షితంగా బయటపడిన ఘటన నిన్న వనస్థలిపురం పరిధిలో జరిగింది.  అతను గల్లంతైన కొన్ని గంటల పాటు ఉత్కంఠ నెలకొని చివరకు  సుఖాంతం అయ్యింది.  శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి  చౌరస్తా నుంచి ఎల్బీనగర్ కు వరద నీరు చేరింది.

chinatalakuntaలోని సురభి హోటల్ సమీపంలో  కల్వర్టు నాలా ఉంది.  అక్కడ భారీగా వరద ఉండడంతో బైక్ పై వచ్చిన సరూర్ నగర్ పరిధిలోని తపోవన్ కాలనీకి చెందిన jagadeesh ద్విచక్ర వాహనంతో సహా manhole లో పడిపోయాడు. దీంతో అతడు గల్లంతయ్యారని అందరూ భావించారు. ఏసిపి పురుషోత్తం రెడ్డి,  కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డి, పోలీసులు, జీహెచ్ఎంసీ బృందం  చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.  రెండు గంటల తర్వాత అతను ప్రత్యక్షం అవడంతో ఊపిరిపీల్చుకున్నారు. 

కాగా, హైదరాబాద్ తోపాటు శివార్లలో శుక్రవారం heavy rains కురిశాయి.  హైదరాబాద్ నగరంలో దాదాపు గంటన్నరపాటు కుండపోతగా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది.  ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పొడి వాతావరణం ఉన్నా... రాత్రి 7:30 గంటలకు ఓ మోస్తారుగా ప్రారంభమైన వర్షం క్రమంగా ఉధృతంగా మారింది.  

దాదాపు గంటన్నరకు ఆగకుండా కురిసిన వానతో రోడ్లపై పెద్దఎత్తున flood water పోటెత్తింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫిల్మ్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, హైటెక్‌సిటీ, హిమాయత్‌నగర్‌, సికింద్రాబాద్,  రాజేంద్రనగర్,  కుర్మగూడ తదితర ప్రాంతాల్లో వరద తీవ్రత అధికంగా కనిపించింది.  

Hyderabad Rains : వరదనీటిలో బతుకమ్మలైన కార్లు, ట్రక్కులు.. వాటర్ రెస్టారెంట్లుగా మారిన ఓల్డ్ సిటీ హోటల్స్..

కుర్మగూడలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్ పేట్ లో రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 13.68 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే సరూర్ నగర్ మండలం  లింగోజిగూడ ప్రాంతంలో  రికార్డు స్థాయిలో 13 సెంటీమీటర్లు,  నందిగామ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 11.35 సెంటీమీటర్లు,  మహేశ్వరం మండలం పారిశ్రామిక ప్రాంతంలో 9.03 సెంటీమీటర్లు,  హయత్ నగర్ మండలం సౌత్ హస్తినాపురం ప్రాంతంలో  8.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. 

సరూర్ నగర్ మండలం ఎల్బీనగర్-జిహెచ్ఎంసి ప్రాంతంలో 8.58 సెంటీమీటర్లు,  మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం మారుతీనగర్ లో 8.5 సెంటీమీటర్లు,  నాచారంలో 8.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.  కాగా హైదరాబాదులోని ఓల్డ్ ఉస్మాన్‌ఘంజ్‌, మహరాజ్‌ఘంజ్‌ మార్కెట్లలో దుకాణాలు నీట మునిగిపోయాయి.

click me!