కేసిఆర్ కు ఇవాంక రాసిన లేఖలో ఏముందో తెలుసా ?

First Published Dec 19, 2017, 2:32 PM IST
Highlights
  • గోల్కొండ పర్యటనలో ఫిదా అయిన ఇవాంక
  • మళ్లీ ఇండియా వస్తానని కేసిఆర్ కు వెల్లడి

మొన్న అమెరికా అధినేత కుమార్తె ఇవాంక ట్రంప్ ఇండియా పర్యటన ముగించుకొని వెళ్లిపోయింది. ఆమె ఇండియా పర్యటనలో పులకించిపోయే సంఘటన మాత్రం గోల్కొండ కోట సందర్శనే. ఆ విషయాన్ని ఇవాంకనే స్వయంగా చెప్పింది. గోల్కొండ కోటలో ఆమె ఫొటోలు కూడా దిగింది. కోటలోకి వెళ్లి అబ్బురపడింది.

అమెరికా పోయిన తర్వాత తెలంగాణ సిఎం కేసిఆర్ కు ఇవాంక ఒక లేఖ రాసింది. ఆ లేఖ సిఎం కు అందింది. ఆ లేఖను ఇవాంక నే స్వయంగా రాసినట్లు ఉంది. ప్రింటెడ్ లెటర్ కాకుండా చేతిరాత ద్వారా ఆమె తన సందేశాన్ని సిఎం కేసిఆర్ కు తెలపడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.

ఇవాంకకు ఏ లోటు రాకుండా తెలంగాణ సర్కారు అహర్నిషలు పనిచేసింది. ఆమె గోల్కొండ కోటను సందర్శించి ఫిదా అయిపోయింది. తెలంగాణ సర్కారు ఇచ్చిన ఆతిథ్యం ఆమెకు బాగా నచ్చింది. అందుకే మరోసారి ఇండియాకు రావాలని తాను కోరుకుంటున్నట్లు ఇవాంక తన అభిమానాన్ని, ఆసక్తిని తన ఉత్తరం  లో తెలిపింది.

తెలంగాణ ముఖ్యమంత్రికి అమెరికా నెంబర్ 2 స్థానంలో ఉన్న ఇవాంక లేఖ రాయడం చూస్తే ఆమెకు ఏలోటూ రాకుండా హైదరాబాద్ లో సకల సౌకర్యాలు కల్పించారని చెప్పవచ్చు. అంతేకాదు తనకు మళ్లీ ఇండియాకు రావాలని కోరికగా ఉన్నట్లు కూడా తెలంగాణ సిఎం కేసిఆర్ కు రాసిన లేఖలో పేర్కొనడం గమనార్హం. మొత్తానికి ఇవాంక పర్యటన టిఆర్ఎస్ ప్రభుత్వ కీర్తిపతాకను చాటిందని చెప్పవచ్చు.  

click me!