హైదరాబాద్ లో ఇవాంక ఫుల్ ఖుష్

Published : Nov 28, 2017, 03:31 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
హైదరాబాద్ లో ఇవాంక ఫుల్ ఖుష్

సారాంశం

 తనకు లభించిన స్వాగతం పట్ల ఇవాంక హ్యాపీ స్వాగతం పలికిన వారికి ధన్యవాదాలు తెలిపిన ఇవాంక ఇక్కడ ఆతిథ్యం బావుందని ట్వీట్  

అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ కు వచ్చిన ఇవాంక ట్రంప్ ఇక్కడి ఆతిద్యానికి ఫిదా అయిపోయారు. ఇవాళ తెల్లవారుజామున నగరానికి వచ్చిన ఇవాంకకు ఘన స్వాగతం లభించింది. తనకు ఆత్మీయ స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి దన్యవాదాలు తెలుపుతున్నట్లు ఇవాంక ట్వీట్ చేశారు. హైదరాబాద్‌కు రావడం, ఇక్కడి ఆతిద్యాన్ని స్వీకరించడం తనకెంతో ఆనందం కలిగించిందని ఇవాంక ట్రంప్ తెలిపారు. 

హైదరాబాద్ లో జరిగే అంతర్జాతీయ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ పాల్గొననున్నారు. ఇవాళ సాయంత్రం హెచ్‌ఐసీసీలో ఈ సమావేశం జరగనుంది. ఇందుకోసం ఇవాంక రెండు రోజులపాటు నగరంలో ఉండనున్నారు. ఈ సమావేశంలో వివిధ దేశాల ప్రతినిధులతో పాటు స్వదేశీ ఔత్సాహిక వ్యాపారవేత్తలు పాల్గొననున్నారు. వారితో ఇవాంక సమావేశమవుతారు. అనంతరం పలక్ నుమా ప్యాలస్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విందులో పాల్గొంటారు. రెండో రోజు కూబా ఇవాంక సదస్సులో పాల్గొన్న వివిధ దేశాల ప్రతినిధులతో చర్చించనున్నారు.

అయితే ఇవాంక తనకు హైదరాబాద్ లో లభించిన వెల్ కమ్ పట్ల ట్వీట్ చేయగా, అమెరికా అంబాసిడర్ కెన్ జెస్టర్ కూడా ఇవాంకాకు థ్యాంక్స్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ట్వీట్‌ను తన అకౌంట్‌లో ఆయన పోస్ట్ చేశారు. ఆమెకు స్వాగతం పలకడం తమకు గౌరవంగా భావిస్తున్నామని జెస్టర్ ట్వీట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.
Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం