టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఇంటిపై ఐటీ దాడులు

By sivanagaprasad kodatiFirst Published Oct 12, 2018, 9:03 AM IST
Highlights

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 60 మంది అధికారుల బృందం కడప, హైదరాబాద్‌లోని ఆయన ఇళ్లు, వ్యాపార కార్యాలయాలపై దాడులు నిర్వహించి సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం రమేశ్ ఢిల్లీలో ఉన్నారు.

తెలుగు దేశం పార్టీ నేతలపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ నేతల ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ దాడులు నిర్వహించింది.

నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, కావలి టీడీపీ ఇన్‌ఛార్జ్ బీద మస్తాన్ రావు ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన తర్వాతి రోజే విజయవాడ, గుంటూరుల్లోని ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఐటీ దాడుల ఎఫెక్ట్.. వైసీపీలో ఆమంచి..?

ఐటీ అధికారులకు సెక్యూరిటీ విత్ డ్రా: చంద్రబాబు

ఐటీ దాడులు కేంద్రం స్కెచ్: చంద్రబాబు

ఐటీ దాడులు: చంద్రబాబునాయుడు తీవ్ర నిర్ణయం

ఏపీలో ఐటీ దాడులు... దీని వెనక మరో కోణం..?

బెజవాడలో ఐటీ దాడుల కలకలం.. టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు పక్కా వ్యూహం..?

click me!